close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నోరు పారేసుకుంటున్న విపక్షాలు

వైద్యులు, సిబ్బంది మనోస్థైర్యం దెబ్బ తీయవద్దు
ప్రతిపక్షాలకు కేటీఆర్‌ విజ్ఞప్తి

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: విపత్తు వచ్చినప్పుడు సమష్టిగా ఎదుర్కోవాలి.. కానీ కరోనాపై విపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నాయని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. వారి తిట్లను తాము ఆశీర్వాదాలుగా తీసుకుంటామన్నారు. కొవిడ్‌ను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలోనే దేశం మూడో స్థానంలో ఉందని, దీన్ని ప్రధాని మోదీ వైఫల్యంగా చెప్పాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాల కొత్త భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పత్రికలు కరోనాపై సానుకూల కథనాలు ఇవ్వాలని, ప్రజల సందేహాలను, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. బాధితుల్లో 98 శాతం మంది స్వస్థత పొంది డిశ్ఛార్జి అవుతున్నారని.. 2 శాతం మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు. కరోనా బాధితులు మూడు, నాలుగు ప్రైవేటు ఆస్పత్రులకు తిరుగుతున్నా చికిత్సను అందించడం లేదని, చివరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బాధితులకు చికిత్స అందుతోందన్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీయవద్దని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే రాష్ట్రంలో అయిదు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌కు వెయ్యి పడకల ఆస్పత్రిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

వైద్య సేవల్లో రాష్ట్రానిది మూడో స్థానం: ఈటల
రాష్ట్ర మంత్రి ఈçల రాజేందర్‌ మాట్లాడుతూ.. వైద్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగానికి అవసరమైన నిధులు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో ధాన్యం పండుతుండటంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల నుంచి కోటి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాగా, అందులో తెలంగాణ వాటానే 62లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యమని పేర్కొన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ దేవాలయం అని.. రైతుబంధు, కేసీఆర్‌ కిట్‌, రైతుబీమా వంటి పథకాలు అక్కడి నుంచే అమలు అవుతున్నాయని అన్నారు.

కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కు ప్రారంభం
మహబూబ్‌నగర్‌ శివారులోని 2,087 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కుగా అభివృద్ధి చేశారు. ఈ పార్కును మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. గతంలో మయూరి పార్కుగా ఉన్న దీనిపేరు కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కుగా మార్చారు. దీంతోపాటు హరితహారం, 660 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, మహిళా సంఘాలకు రూ.145.24 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో 2.82 లక్షల ఇళ్లను రాష్ట్రంలో నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు.

మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన కుటుంబం
తమ భూమికి తొమ్మిదేళ్లుగా పాసు పుస్తకం మంజూరు చేయలేదని మహబూబ్‌నగర్‌ కుమ్మరివాడికి చెందిన శివశంకర్‌ కుటుంబం వీరన్నపేట నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌కు అడ్డుపడింది. పోలీసులు వారిని పక్కకు తప్పించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.