
తాజా వార్తలు
అధిక పన్నులు సామాజిక అన్యాయం: సీజేఐ
దిల్లీ: పన్ను సంబంధిత వివాదాల్లో త్వరితగతిన పరిష్కారం అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహమన్నారు. వివాదాల్లో చిక్కుకున్న నగదును విడుదల చేయడమేని అన్నారు.
ఇన్కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొని మాట్లాడారు. పన్ను ఎగవేత సామాజిక అన్యాయమని వ్యాఖ్యానించారు. అలాగే, ఏకపక్షంగా అధిక పన్నులు వేయడం కూడా సామాజిక అన్యాయానికి కారణమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ అవసరం ఉందన్నారు. అయితే, విచక్షణతో న్యాయాన్ని వెలువరించే మనిషికి ప్రత్యామ్నాయం కారాదని జస్టిస్ బోబ్డే అన్నారు.
Tags :