అలా తెరిచి.. ఇలా మూసేశారు

తాజా వార్తలు

Published : 21/02/2020 22:56 IST

అలా తెరిచి.. ఇలా మూసేశారు

దిల్లీ: షాహీన్‌బాగ్‌ ఆందోళనల కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిల్లీ-ఎన్‌సీఆర్‌ వాసులకు నిరాశే ఎదురైంది. ట్రాఫిక్‌ సమస్యను అరికట్టేందుకు నోయిడా-దిల్లీ-ఫరీదాబాద్‌ మధ్య ప్రత్యామ్నాయ రహదారిని తెరిచినట్లే తెరిచిన పోలీసులు ఆ వెంటనే మళ్లీ మూసేశారు. ఈ ఉదయం రహదారిపై ఉన్న బారికేడ్లను తీసేశారు. అయితే కాసేపటికే మళ్లీ రోడ్డుపై బారికేడ్లను అడ్డంగా పెట్టారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

దిల్లీలోని కాళింది కుంజ్‌ మీదుగా నోయిడా, ఫరీదాబాద్‌లను కలిపే ఈ రోడ్డును షాహీన్‌బాగ్‌ ఆందోళనల కారణంగా 69 రోజుల కిందట మూసేశారు. అయితే దీనివల్ల తాము ట్రాఫిక్‌ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, షాహీన్‌బాగ్‌ నుంచి ఆందోళనకారులను తొలగించి రహదారిని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ విషయమై షాహీన్‌బాగ్ ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపేందుకు ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులను మధ్యవర్తులుగా నియమించింది. వీరు రెండు రోజుల పాటు నిరసనకారులతో చర్చించారు. ‘ఆందోళన హక్కే అయినప్పటికీ దానివల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకూడదు. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని మేం వారిని కోరాం’ అని మధ్యవర్తిగా ఉన్న సీనియర్‌ లాయర్‌ సంజయ్‌ హెగ్దే తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని