Corona: 60వేలకు తగ్గిన కేసులు..
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 12:13 IST

Corona: 60వేలకు తగ్గిన కేసులు..

95.43 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. సోమవారం 17,51,358 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..60,471 మందికి పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కేసులు..నిన్న మార్చి 31నాటి కనిష్ఠానికి చేరాయి. గత కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో వాటి సంఖ్యలో పెరుగుదల కనిపించింది. అయితే నిన్న మూడువేల దిగువనే మరణాలు నమోదవడం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 2.9కోట్లకు పైబడగా..3.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38కోట్లకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.  

ప్రస్తుతం దేశంలో 9,12,378 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,17,525 మంది కోలుకోగా.. రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. మొత్తంగా 2.82కోట్ల మందికిపైగా వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోపక్క నిన్న 39,27,154 మంది కరోనా టీకా వేయించుకున్నారు. నిన్నటి వరకూ 25.90 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని