Corona: భారీగా పెరిగిన మరణాలు.. అత్యంత కనిష్ఠానికి క్రియాశీల రేటు

తాజా వార్తలు

Updated : 23/10/2021 12:02 IST

Corona: భారీగా పెరిగిన మరణాలు.. అత్యంత కనిష్ఠానికి క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 29 రోజులుగా కొత్త కేసులు 30 వేల మార్క్‌కు దిగువనే ఉంటున్నప్పటికీ.. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13.64లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 16,326 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు నమోదైన కేసుల(15,786)తో పోలిస్తే 3.42శాతం ఎక్కువ. ఇదే సమయంలో మరణాలు భారీగా పెరగడం గమనార్హం. శుక్రవారం 666 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క కేరళలోనే నిన్న 563 మరణాలు నమోదయ్యాయి. తాజా సంఖ్యతో కలిసి దేశంలో ఇప్పటివరకు 4,53,708 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది.

0.51శాతానికి క్రియాశీల రేటు..

అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగానే ఉండటం ఊరటనిస్తోంది. నిన్న 17,677 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.35కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.16శాతానికి పెరిగింది. 2020 మార్చి తర్వాత ఇదే గరిష్ఠ రికవరీ రేటు కావడం విశేషం. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్‌ కేసులు 233 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,73,728 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.51శాతానికి దిగొచ్చింది. క్రియాశీల రేటు ఇంత తక్కువగా ఉండటం 2020 మార్చి తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 

ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 68.48లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 1.01కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని