CoronaVirus: చిన్నారుల గురించి చింతలేదిక..!

తాజా వార్తలు

Published : 28/05/2021 01:42 IST

CoronaVirus: చిన్నారుల గురించి చింతలేదిక..!

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కుటుంబాలను కబళిస్తోంది. కొందరి ఇళ్లలో ఒక్కరికి సోకితే అది అందరికీ పాకుతోంది. కుటుంబంలో ఉన్నవారంతా ఆస్పత్రిలో చేరితే వారి పిల్లల ఆలనా పాలనా చూసుకునే వారు ఉండటం లేదు. బంధువులు కూడా దగ్గరకు తీయకపోవడంతో చిన్నారులు అల్లాడుతున్నారు. అలాంటి పిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో "ట్రాన్సిట్ హోం"లను అందుబాటులోకి తెచ్చారు. కుటుంబ సభ్యులు చికిత్స తీసుకున్నన్ని రోజులు పిల్లల సంరక్షణ వాళ్లే చూసుకోనున్నారు. ఇక్కడ పిల్లలకు మూడు పూటలా భోజనం, పాలు, గుడ్లు అందిస్తారు. ఆట వస్తువులు ఇస్తారు. చికిత్స పొందుతున్న తల్లిదండ్రులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిస్తారు. మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తారు. పిల్లల ఆరోగ్యాన్ని చూడటానికి ఎల్లప్పుడూ ఒక వైద్యుడు అందుబాటులో ఉంటారు. కొవిడ్‌ సోకిన వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటామని, ఎలాంటి దిగులూ చెందొద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు. 040 -23733665 లేదా 1098 నెంబర్లకు ఫోన్‌ చేస్తే తామే వచ్చి పిల్లలను ట్రాన్సిట్ హోంలకు తీసుకువెళ్తామని అధికారులు చెబుతున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని