Rahul gandhi: రాహుల్‌ ఖాతాను లాక్‌ చేశాం.. హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌

తాజా వార్తలు

Published : 12/08/2021 01:29 IST

Rahul gandhi: రాహుల్‌ ఖాతాను లాక్‌ చేశాం.. హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను లాక్‌ చేసినట్లు ట్విటర్‌ దిల్లీ హైకోర్టుకు తెలిపింది. దిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ట్వీట్‌ చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్విటర్‌ ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆయన ట్విటర్‌ ఖాతాను సైతం లాక్‌ చేసినట్లు ట్విటర్‌ పేర్కొంది. ట్విటర్‌ ఇండియాను ఇందులోకి పిటిషనర్‌ అవవసరంగా  లాగారని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్‌ 27కు వాయిదా వేసింది.

అత్యాచారం కేసుల్లో బాధితుల వివరాలు బయటకు తెలిసేలా వ్యవహరించకూడదు. అయితే, దిల్లీలోని బాలిక హత్యాచారం కేసులో బాధితుల కుటుంబ సభ్యుల వివరాలను బయటి ప్రపంచానికి తెలిసేలా రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో రాహుల్‌పై చర్యలకు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆదేశించాలని, రాహుల్‌పై కేసులు నమోదు చేయాలని ఓ సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేశారు. జువైనల్‌, పోక్సో చట్టాలను రాహుల్‌ ఉల్లంఘించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని