ఆ కత్తికి.. ఆ రాకెట్లకు రూ.10 కోట్లు

ప్రధానాంశాలు

Published : 18/09/2021 03:39 IST

ఆ కత్తికి.. ఆ రాకెట్లకు రూ.10 కోట్లు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాల వేలానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతుల ఈ- వేలం  ప్రక్రియ శుక్రవారం మొదలైంది. టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ అథ్లెట్లను ఆయన కలిసినపుడు వాళ్లు తమ క్రీడా వస్తువులను.. మోదీకి బహుమతికి అందించారు. ఇప్పుడు వాటికి వేలంలో భారీ ధర పలుకుతోంది. ఫెన్సర్‌ భవానీ దేవి కత్తి బిడ్‌ ధర రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన కృష్ణ నాగర్‌, రజతం గెలిచిన సుహాస్‌ రాకెట్ల బిడ్‌ కూడా రూ.10 కోట్లకు చేరింది. నీరజ్‌ చోప్రా ఈటె వేలంలో రూ.1.55 కోట్లతో కొనసాగుతోంది. పీవీ సింధు రాకెట్‌ బిడ్‌ రూ.90 లక్షలు దాటింది. బాక్సర్‌ లవ్లీనా గ్లౌవ్స్‌కు  బిడ్‌ రూ.1.92 కోట్లుగా ఉంది. వచ్చే నెల 7 వరకు వేలం కొనసాగుతుందిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన