ఆసియన్‌ అమెరికన్ల ఐదు ప్రధాన భాషల్లో హిందీ

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

ఆసియన్‌ అమెరికన్ల ఐదు ప్రధాన భాషల్లో హిందీ

ప్రవాస భారతీయుల్లో 29 శాతం మందికి ఆంగ్ల ప్రావీణ్యం అంతంతే..

వాషింగ్టన్‌: ఆసియన్‌ అమెరికన్లు మాట్లాడే ఐదు ప్రధాన భాషల్లో హిందీ ఒకటని ఆసియన్‌ అమెరికన్స్‌ అడ్వాన్సింగ్‌ జస్టిస్‌ సంస్థ అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జాన్‌ యాంగ్‌ పేర్కొన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో చైనీస్‌, టగలాగ్‌, వియత్నమీస్‌, కొరియన్‌ భాషలు ఉన్నాయన్నారు. ఆసియన్‌ అమెరికన్ల స్థితిగతులపై ఆయన సెనేట్‌, అంతర్గత భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీకి నివేదిక అందించారు. సుమారు మూడింట రెండొంతుల మంది ఆసియన్‌ అమెరికన్లు వలస వచ్చిన వారిని, వారిలో 52 శాతం మందికి ఆంగ్లంలో ప్రావీణ్యం పరిమితంగానే ఉందని అందులో పేర్కొన్నారు. భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో 29 శాతం మందికి ఆంగ్లంలో ప్రావీణ్యం పెద్దగా లేదన్నారు. దీనివల్ల ఆసియన్‌ అమెరికన్లకు అన్ని విధాలుగా సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఆసియన్ల వ్యతిరేక విద్వేషం పెరిగి పోతోందని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో వారు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కరోనా పుట్టుకకు ఆసియన్లే కారణమని నిందించే ధోరణి పెరిగిందన్నారు. విద్వేష నేరాల ఉద్ధృతితో 31 శాతం నల్ల జాతీయులు, ఆసియన్‌ అమెరికన్లు నిత్యం భయాందోళనతో గడుపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన