close

తాజా వార్తలు

ఓ పండు తిన్నా చాలు!

కొంతమంది మహిళలకు వేళకు తినే సమయం ఉండదు. అలాగని పొట్ట మాడ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోషకాహారం తీసుకునేలా చూసుకోవాలి.  అందుకు  ఏం చేయాలో చూద్దామా...
* యాపిల్‌ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. టిఫిన్‌ తీసుకునే సమయం లేనివారు ఒక యాపిల్‌ తినొచ్చు. ఆకలి తీరుతుంది.  ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది.
* మహిళలకు పని ఒత్తిడి మామూలే. ఇలాంటప్పుడు చిన్న డార్క్‌చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకుని చప్పరించండి. మిగిలిన పనులు చురుగ్గా చేయగలుగుతారు.
* అల్పాహారం తీసుకునేందుకు సమయం లేనప్పుడు ఓ రెండు బ్రెడ్‌స్లైసులు తిన్నా చాలు. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఓ అరటిపండు తీసుకున్నా మంచిదే. దాంతోపాటు గ్లాసు పాలు తాగితే మరీ మంచిది.
* సాయంత్రం పూట ఆకలిగా అనిపిస్తే... సమోసా, బజ్జీల్లాంటివి తినేందుకు ప్రాధాన్యం ఇవ్వకండి. వాటికి బదులు ఓ పండు లేదా క్యారెట్‌, కీరా ముక్కలు, నట్స్‌, గుమ్మడి లేదా పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వంటివి ఎంచుకుని చూడండి. పోషకాలు అందుతాయి. పొట్టనిండిన భావనా కలుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.