close

తాజా వార్తలు

చెపాక్‌లో సాధనలో స్వేదం చిందించిన ముంబయి

చెన్నై: నాలుగు రోజుల విరామం ముగిసింది. ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు తిరిగి కలుసుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. చెపాక్‌లో శుక్రవారం ముంబయి, చెన్నై తలపడుతున్నాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబయి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు మరింత చేరువ అవుతుంది. ఈ నేపథ్యంలో చెపాక్‌లో రోహిత్‌ సేన కఠోర సాధన చేసింది. విశ్రాంతి తీసుకొని సరికొత్త ఉత్సాహంతో మళ్లీ వస్తున్నామని చెబుతోంది.

‘ఇక్కడికి వచ్చేముందు మేమంతా ఒక్కచోట చేరాం. ఈ సాధన శిబిరం ద్వారా ఏం సాధించాలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రతి సాధన శిబిరం నుంచి ఏదో ఒకటి తీసుకోగలమని నా విశ్వాసం. ఈ రోజు మేమంతా చాలా కఠోరంగా శ్రమించాం. దాదాపు 45 నిమిషాల పాటు పరుగు, బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేశాం. ఆటగాళ్లందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ రోజు చాలా బాగుంది. ప్రతి ఆటగాడు కష్టపడ్డాడు. ఇంతకన్నా వారిని నేనింకేమీ అడగను. మేం తీసుకున్న ఈ చిన్న విరామం మంచి చేసిందనే అనుకుంటున్నా’ అని రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ సీజన్‌లో వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.