
తాజా వార్తలు
అమరావతి: పరస్పర అంగీకారంతోనే అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం తప్పుకుందని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించమని కోరితే కన్సార్షియం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే ప్రభుత్వంతో వారికున్న పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స...సింగపూర్ కన్సార్షియం రాసిన లేఖను పూర్తిగా చదవకుండానే చంద్రబాబు, లోకేశ్ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకా ప్రభుత్వం తమదేనన్న భావనలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు వరకు స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాజధాని నిర్మాణాలు 90శాతం పూర్తయ్యాయని తెలుగుదేశం నాయకులు అబద్ధాలు చెబుతున్నారని బొత్స విమర్శించారు. రాజధాని ప్రాంతానికి రావాల్సిన బీఆర్ శెట్టి, ఇండో అమెరికన్ ఆసుపత్రి ప్రాజెక్టులు ఎవరి హయాంలో వెనక్కి పోయాయని బొత్స ప్రశ్నించారు. కొద్ది రోజుల్లోనే అనేక దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని...తొందరెందుకని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానం ద్వారా ఏ లబ్ధిదారుడికైనా ఉచితంగా ఇసుక అందిందా అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇసుక దోచుకుని ఇప్పుడు దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తోందని.. మాతృ భాషపై అందరికీ మమకారం ఉంటుందని చెప్పారు. మూడు సార్లు మంత్రిగా ఉన్నా.. సరిగా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బందిపడ్డానో తనకు తెలుసని చెప్పారు. తెదేపా, జనసేన దొందూ దొందేనని బొత్స విమర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
