close

తాజా వార్తలు

పదివేల యాప్స్‌ తొలగించిన ఫేస్‌బుక్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రమాదకరమైన 10వేల అప్లికేషన్లను తొలగించినట్లు తెలిపింది. గత సంవత్సరం మార్చిలో కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదం సందర్భంగా దర్యాప్తు చేపట్టిన సంస్థ ఈ చర్యలకు ఉపక్రమించినట్లుగా వెల్లడించింది. ‘ఇవి వినియోగదారుల అంతర్గత భద్రతకు ప్రమాదకారులు కానప్పటికి, వీటిలో చాలా వరకు పరీక్షల దశలో ఉండటం వల్ల,వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి రాని కారణంగా 400 మంది యాప్‌ డెవలపర్స్‌కు చెందిన పదివేల యాప్స్‌ను తొలగించాం’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చిన కథనంలో తెలిపింది.

‘కంపెనీ విధానాలకు విరుద్ధంగా  ఫేస్‌బుక్‌ నుంచి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి వాటిని బహిర్గతం చేసిన యాప్స్‌ని పూర్తిగా తొలగించాం. మా దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. ఈ చర్యలలో భాగంగా యాప్‌ డెవలపర్స్‌కి వినియోగదారులకు సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉన్న కొన్ని ఏపీఐస్‌ (అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌)ని కూడ తొలగించాం’ అని బ్లాగ్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఇకమీదట వినియోగదారుల వివరాలను సేకరించే యాప్స్‌, అవి ఏవిధంగా తమ యాప్‌నకు ఉపయోగకరం అనేది కూడ తెలిజేయవలసి ఉంటుందని తెలిపింది. కాగా, ఈ సంవత్సరం మొదట్లో కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా కేసులో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టిసి) ఫేస్‌బుక్‌కు 5 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు కంపెని వ్యాపార నిర్వహణపై కూడ పలు ఆంక్షలు విధించింది.  ఈ పొరపాటు కారణంగా ఫేస్‌బుక్‌ తన ఆప్‌ డెవలపర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.