
తాజా వార్తలు
హైదరాబాద్: స్టార్ కథానాయకుడిగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మహేశ్‌బాబు. ‘1 నేనొక్కడినే’లో ఆయన తనయుడు గౌతమ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, సితార తెరపై కనిపించదు వినిపిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘ఫ్రోజెన్-2’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిన్నప్పటి ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ లిటిల్‌స్టార్ సితార పాప చిన్నప్పటి ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పనుంది. డిస్నీ కుటుంబానికి నీకు స్వాగతం సితార’’- వాల్డిస్నీ స్టూడియోస్ ఇండియా
కథానాయిక నిత్యా మేనన్ రాకుమార్తె ఎల్సా(పెద్దయ్యాక) పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు ప్రకటించారు. 2013లో డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేషన్ చిత్రం ‘ఫ్రోజెన్’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ఫ్రోజెన్ 2’ తెరకెక్కింది. క్రిస్ బక్, జెన్నీఫర్ లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీలో రాకుమార్తె ఎల్సా పాత్రకు ప్రియాంకా చోప్రా, రాకుమార్తె అన్నా పాత్రకు పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పారు. ఇటీవల కాలంలో హాలీవుడ్ చిత్రాలకు తెలుగులోని ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ‘ది లయన్ కింగ్’లో ప్రధాన పాత్రకు నాని డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
