
తాజా వార్తలు
ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు స్పందించలేదు.. సారీ: మాంజిమా మోహన్
హైదరాబాద్: ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కథానాయిక మాంజిమా మోహన్ గాయపడ్డారు. కాలికి సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘కొన్ని వారాల క్రితం నా జీవితంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. మరో నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ‘మీ జీవితంలో ఎదుర్కొన్న అతి కష్టమైన ఘటన ఏది?’ అని ఒకప్పుడు చాలాసార్లు నన్ను కొందరు అడిగారు. ‘ఇప్పటి వరకు అలాంటివి ఏమీ జరగలేదు’ అని వారికి చెప్పాను.
కానీ, ఇప్పుడు జీవితంలో దానికి విభిన్నమైన సమాధానం దొరికింది. గాయపడ్డ తర్వాత కొన్ని రోజులపాటు చాలా బాధపడ్డా. చివరికి ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడగలుగుతున్నా. నాకు ఇష్టమైన నటనకు తాత్కాలికంగా దూరంగా ఉన్నాను. గాయపడ్డ తర్వాత వచ్చిన మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించనందుకు క్షమించండి. ఈ అవకాశాన్ని (విశ్రాంతిని) నేను బాగా ఉపయోగించుకున్నా. నాలోని నన్ను తెలుసుకున్నా. ఈ బ్రేక్ నాకు చాలా అవసరమని అర్థం చేసుకున్నా. నేను ఇలా మాట్లాడటం కాస్త విభిన్నంగానే అనిపించొచ్చు. ఈ సంఘటన, పరిస్థితులు నన్ను చాలా మార్చాయి. ఇంకా బలమైన వ్యక్తిని చేశాయి. ‘కారణం లేకుండా ఏదీ జరగదు’ అనడం వాస్తవమే’ అని పోస్ట్ చేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
