close
జర్మనీలో ఘనంగా దీపావళి వేడుకలు

బెర్లిన్‌: జర్మనీలోని స్టట్‌గర్ట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సమైక్య వేదిక (ఎస్‌టీవీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు స్టట్‌గర్ట్‌ ప్రాంతంలోని తెలుగు ప్రజలు భారీగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. చిన్నారులు ఆడి పాడారు. చిన్నారులు, మహిళలు నిర్వహించిన ఫ్యాషన్‌ షో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టట్‌గర్ట్‌ ప్రాంతంలో తెలుగు ప్రజలను కలుపుతూ, తెలుగు సంస్కృతిని చాటి చెప్పేందుకు ఎస్‌టీవీ సభ్యులు చేస్తున్న కృషిని అక్కడికి వచ్చిన వారు అభినందించారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని