News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 30 Jun 2022 22:30 IST
1/27
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య గురువారం అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని దళిత నాయకుడు అజయ్‌కుమార్ ఇంట్లో భోజనం చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య గురువారం అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని దళిత నాయకుడు అజయ్‌కుమార్ ఇంట్లో భోజనం చేశారు.
2/27
3/27
ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లలంతా సికింద్రాబాద్ సీతాఫల్‌మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాసిన పేద విద్యార్థులు. గురువారం విడుదల చేసిన పరీక్షల ఫలితాల్లో భార్గవి అనే బాలిక సికింద్రాబాద్ మండలానికి టాపర్‌గా నిలవగా మిగిలిన వారికి 7పాయింట్లకు పైగా మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లలంతా సికింద్రాబాద్ సీతాఫల్‌మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాసిన పేద విద్యార్థులు. గురువారం విడుదల చేసిన పరీక్షల ఫలితాల్లో భార్గవి అనే బాలిక సికింద్రాబాద్ మండలానికి టాపర్‌గా నిలవగా మిగిలిన వారికి 7పాయింట్లకు పైగా మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు.
4/27
5/27
పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌ ఇది. సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌ ఇది. సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.
6/27
7/27
8/27
మహారాష్ట్రలో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపా, శివసేన తిరుగుబాటు వర్గం కలవడంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. మహారాష్ట్రలో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపా, శివసేన తిరుగుబాటు వర్గం కలవడంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు.
9/27
10/27
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పహారా కాస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బంది హోటల్‌ ప్రాంగణంలో కాసేపు సేదతీరుతూ కనిపించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పహారా కాస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బంది హోటల్‌ ప్రాంగణంలో కాసేపు సేదతీరుతూ కనిపించారు.
11/27
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మకు అమరావతిలోని తాళ్లాయపాలెం కోటిలింగ మహాశైవ క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల ఆలయాల నుంచి వచ్చిన భక్తులు సారె సమర్పించారు. కోలాటాలతో ఉరేగింపుగా వచ్చిన వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మకు అమరావతిలోని తాళ్లాయపాలెం కోటిలింగ మహాశైవ క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల ఆలయాల నుంచి వచ్చిన భక్తులు సారె సమర్పించారు. కోలాటాలతో ఉరేగింపుగా వచ్చిన వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
12/27
13/27
ఆదిలాబాద్‌ పట్టణంలోని టైలర్స్‌ కాలనీకి చెందిన విద్యార్థిని పోలీసుల తనిఖీల కారణంగా పాలిసెట్ పరీక్షకు సరైన సమయానికి చేరుకోలేకపోయింది. ఆటో డ్రైవర్‌ పోలీసులను చూసి మరో మార్గం గుండా పట్టణ శివారు ప్రాంతంలోని నలంద కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకెళ్లాడు. నిమిషం నిబంధన కారణంగా అప్పటికే 11గంటలు దాటడంతో ఆమెను లోనికి అనుమతించలేదు. మరోవైపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలంటూ విద్యార్థిని తల్లి ప్రాధేయపడింది. ఫలితం లేకపోవడంతో విద్యార్థిని ఏడుస్తూ ఇంటిబాట పట్టింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని టైలర్స్‌ కాలనీకి చెందిన విద్యార్థిని పోలీసుల తనిఖీల కారణంగా పాలిసెట్ పరీక్షకు సరైన సమయానికి చేరుకోలేకపోయింది. ఆటో డ్రైవర్‌ పోలీసులను చూసి మరో మార్గం గుండా పట్టణ శివారు ప్రాంతంలోని నలంద కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకెళ్లాడు. నిమిషం నిబంధన కారణంగా అప్పటికే 11గంటలు దాటడంతో ఆమెను లోనికి అనుమతించలేదు. మరోవైపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలంటూ విద్యార్థిని తల్లి ప్రాధేయపడింది. ఫలితం లేకపోవడంతో విద్యార్థిని ఏడుస్తూ ఇంటిబాట పట్టింది.
14/27
15/27
హైదరాబాద్‌లోని ఓ ఎలక్ర్టానిక్‌ షోరూమ్‌లో ‘బిగ్గెస్ట్ ల్యాప్‌టాప్‌ సేల్‌’ ప్రారంభోత్సవానికి బిగ్‌బాస్‌ ఫేమ్‌ చొక్కారపు స్రవంతి, లహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ఎలక్ర్టానిక్‌ షోరూమ్‌లో ‘బిగ్గెస్ట్ ల్యాప్‌టాప్‌ సేల్‌’ ప్రారంభోత్సవానికి బిగ్‌బాస్‌ ఫేమ్‌ చొక్కారపు స్రవంతి, లహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
16/27
17/27
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నోవాటెల్‌ హోటల్‌ పరిసరాల్లో ఆర్మీ హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ అధికారులు పహారా కాస్తున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నోవాటెల్‌ హోటల్‌ పరిసరాల్లో ఆర్మీ హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ అధికారులు పహారా కాస్తున్నారు.
18/27
19/27
దిల్లీలో గురువారం వర్షం కురుస్తుండగా చిన్నారులు ఉత్సాహంగా వర్షంలో తడుస్తూ, ఆడుతూ సందడి చేశారు. దిల్లీలో గురువారం వర్షం కురుస్తుండగా చిన్నారులు ఉత్సాహంగా వర్షంలో తడుస్తూ, ఆడుతూ సందడి చేశారు.
20/27
శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే గురువారం గువాహటి శిబిరం వీడి ముంబయి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ను కలిశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడణవీస్‌ మాట్లాడుతూ.. శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే గురువారం గువాహటి శిబిరం వీడి ముంబయి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ను కలిశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడణవీస్‌ మాట్లాడుతూ.. శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.
21/27
జపాన్‌ కగవ ప్రావిన్స్‌లోని జెన్‌సుంగిలో చతురస్రాకార పుచ్చకాయల్ని ప్రదర్శించారు. అలంకరణలో వినియోగించే ఈ ఒక్కొక్క పుచ్చకాయను సుమారు 10వేల యన్‌(74డాలర్లు)కు కొనుగోలు చేస్తారు. వీటికి అన్ని దేశాల్లోనూ భారీ డిమాండ్‌ ఉంది. జపాన్‌ కగవ ప్రావిన్స్‌లోని జెన్‌సుంగిలో చతురస్రాకార పుచ్చకాయల్ని ప్రదర్శించారు. అలంకరణలో వినియోగించే ఈ ఒక్కొక్క పుచ్చకాయను సుమారు 10వేల యన్‌(74డాలర్లు)కు కొనుగోలు చేస్తారు. వీటికి అన్ని దేశాల్లోనూ భారీ డిమాండ్‌ ఉంది.
22/27
ఎంపీ సంతోశ్‌ కుమార్‌కు పర్యావరణ విభాగంలో ‘సాలుమారద తిమ్మక్క నేషనల్‌ గ్రీన్‌ అవార్డు’ ప్రదానం చేశారు. కర్ణాటకలో నిర్వహించిన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీత, పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సృష్టించి ఎంతో మందితో మొక్కలు నాటిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీ సంతోశ్‌ కుమార్‌కు పర్యావరణ విభాగంలో ‘సాలుమారద తిమ్మక్క నేషనల్‌ గ్రీన్‌ అవార్డు’ ప్రదానం చేశారు. కర్ణాటకలో నిర్వహించిన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీత, పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సృష్టించి ఎంతో మందితో మొక్కలు నాటిస్తున్న విషయం తెలిసిందే.
23/27
సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సిద్దిపేట జిల్లాలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్‌ బుధవారం బయల్దేరారు. మార్గంమధ్యలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో వెంకట్‌ తల, చేతికి గాయాలయ్యాయి. సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సిద్దిపేట జిల్లాలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్‌ బుధవారం బయల్దేరారు. మార్గంమధ్యలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో వెంకట్‌ తల, చేతికి గాయాలయ్యాయి.
24/27
నేటి నుంచి గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి.. 

జగదాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పోతు రాజులతో 

కలిసి మంత్రులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
నేటి నుంచి గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి.. జగదాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పోతు రాజులతో కలిసి మంత్రులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
25/27
26/27
దక్షిణ శ్రీనగర్‌ గుండా అమర్‌నాథ్‌ యాత్రకు వెళుతున్న యాత్రికులు వీరు. గుర్తు తెలియని దుండగుల దాడి ముప్పు పొంచి ఉన్న 

నేపథ్యంలో అధికారులు యాత్ర పొడవునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు వైర్‌లైస్ ట్రాకింగ్‌ ట్యాగ్‌లు ఇచ్చారు. డ్రోన్‌ల 

ద్వారా యాత్ర సాగే మార్గంలో నిఘా కొనసాగిస్తున్నారు. దక్షిణ శ్రీనగర్‌ గుండా అమర్‌నాథ్‌ యాత్రకు వెళుతున్న యాత్రికులు వీరు. గుర్తు తెలియని దుండగుల దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు యాత్ర పొడవునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు వైర్‌లైస్ ట్రాకింగ్‌ ట్యాగ్‌లు ఇచ్చారు. డ్రోన్‌ల ద్వారా యాత్ర సాగే మార్గంలో నిఘా కొనసాగిస్తున్నారు.
27/27
ఈ చిత్రం చూసి అదేంటీ మట్టి కుండలపై ఇలా కూర్చున్నారని ఆశ్చర్యపోతున్నారా? శామీర్‌పేట చెరువు కట్టపై సందర్శకులు 

కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు ఇవి. కుండల ఆకారంలో ఆకర్షణీయంగా ఉండటంతో ఇక్కడ సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు 

పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం చూసి అదేంటీ మట్టి కుండలపై ఇలా కూర్చున్నారని ఆశ్చర్యపోతున్నారా? శామీర్‌పేట చెరువు కట్టపై సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు ఇవి. కుండల ఆకారంలో ఆకర్షణీయంగా ఉండటంతో ఇక్కడ సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని