మండలి సభ్యుడిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం!

తాజా వార్తలు

Published : 19/05/2020 03:39 IST

మండలి సభ్యుడిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం!

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శాసనమండలి సభ్యుడిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఠాక్రేతో పాటు మరో ఎనిమిది మంది కూడా మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రితోపాటు నూతనంగా ఎన్నికైన సభ్యులను గవర్నర్‌ అభినందించారు. ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకు కేవలం తొమ్మిది మందే నామినేషన్లు వేయడంతో ఫలితం ఏకగ్రీవమైంది. తొమ్మిదిమందిలో శివసేన నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు మరోసభ్యుడు ఉండగా.. బీజేపీ నుంచి నలుగురు, ఎన్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని