Team India: ఈ ఏడాది చివర్లో  టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన

తాజా వార్తలు

Published : 21/09/2021 01:32 IST

Team India: ఈ ఏడాది చివర్లో  టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన

న్యూ దిల్లీ: ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఆ దేశంతో ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. దీంతో పాటు వచ్చే ఏడాది జూన్‌ వరకు టీమ్‌ఇండియా ఆడబోయే సిరీస్‌లను బీసీసీఐ ఖరారు చేసింది. నవంబరు 2021 నుంచి జూన్‌ 2022 మధ్యకాలంలో టీమ్‌ఇండియా వివిధ దేశాలతో పద్నాలుగు టీ20, 3 వన్డే,  4 టెస్టు మ్యాచులు ఆడనుంది. మొదటగా న్యూజిలాండ్‌ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల్లో భారత్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌.. వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడనుంది. అది ముగిసిన వెంటనే శ్రీలంక భారత్‌లో పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల్లో భారత్‌తో పోటీ పడనుంది. చివరగా జూన్‌లో దక్షిణాఫ్రికా.. భారత్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మధ్యకాలంలో బీసీసీఐ ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించనుంది. మరో ఏడాది వ్యవధిలోనే మరో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో.. ఆటగాళ్లు మెరుగ్గా రాణించేందుకు 14 టీ20 మ్యాచులను షెడ్యూల్‌ చేశామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని