Cricket News: మోర్గాన్‌, మెక్‌కలమ్‌పై కేకేఆర్‌ నజర్‌!
close

తాజా వార్తలు

Published : 10/06/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: మోర్గాన్‌, మెక్‌కలమ్‌పై కేకేఆర్‌ నజర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతి వివక్ష, జాతి విద్వేషాన్ని సహించే ప్రసక్తే లేదని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని వెల్లడించింది. పూర్తి సమాచారం తెలిశాక ఇయాన్‌ మోర్గాన్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌ వ్యవహారంపై స్పందిస్తామని తెలిపింది. 

భారతీయ యువ ఆటగాళ్లను కించపరుస్తూ మోర్గాన్‌, మెక్‌ కలమ్‌, జోస్‌ బట్లర్‌ చేసిన పాత ట్వీట్లు ప్రస్తుతం దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువకుడిగా జాతి విద్వేష, స్త్రీవివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై కొత్త ఆటగాడు ఓలీ రాబిన్‌సన్‌ను ఈసీబీ సస్పెండ్‌ చేసింది. 2018లో ‘సర్‌’ అంటూ భారతీయులు యాస, భాషను ఎగతాళి చేస్తూ మోర్గాన్‌, బట్లర్ చేసిన ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. దాంతో వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మొదలయ్యాయి.

‘ఆటగాళ్ల విద్వేషపూరితమైన ట్వీట్లపై గతవారం మేం దృష్టి సారించాం. వారు గతంలో పోస్టు చేసిన వివక్షతతో కూడిన సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా ఆటలో వివక్షకు తావులేదు. అవసరమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. నిజానిజాలు తెలుసుకుని వ్యవహరిస్తాం’ అని ఓ ఈసీబీ ప్రతినిధి వెల్లడించాడు.

తమకూ పూర్తి సమాచారం తెలియదని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ అన్నారు. ‘ఈ వ్యవహారంపై మాకింకా పూర్తి వివరాలు అందలేదు. ఏం జరిగిందో తెలియకుండా స్పందించడం సరికాదు. నిజానిజాలు తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా నైట్‌రైడర్స్‌ జాతి వివక్షను అస్సలు సహించబోదని స్పష్టం చేస్తున్నా’ అని ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని