IPL 2021: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందుదీపక్‌ హుడాట్వీట్‌పై ఏసీయూ నజర్‌

తాజా వార్తలు

Published : 23/09/2021 08:03 IST

IPL 2021: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందుదీపక్‌ హుడాట్వీట్‌పై ఏసీయూ నజర్‌

(Photo: Deepak Hooda Twitter)

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా.. మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ ముంగిట చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. హెల్మెట్‌ పెట్టుకుని ఆటకు సిద్ధమవుతున్న ఫొటో పెట్టి.. ఇదిగో వస్తున్నాం అనే వ్యాఖ్య జోడించాడు. రాయల్స్‌తో మ్యాచ్‌ ఆరంభానికి రెండు గంటల ముందు అతడీ ట్వీట్‌ చేశాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇలా ఆటకు ముందు మ్యాచ్, జట్టు సమాచారాన్ని బహిరంగ పరచడం తప్పు. తాను తుది జట్టులో ఉన్న విషయాన్ని ఈ ట్వీట్‌ ద్వారా హుడా చెప్పకనే చెప్పినట్లయింది. ఇది బుకీలకు ఉపయోగపడే విషయమన్న ఉద్దేశంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) హుడా ట్వీట్‌పై దృష్టిసారించింది. ఈ ట్వీట్‌ హుడా నేరుగా వేసి ఉండకపోవచ్చని, ఇది అతడి ట్విట్టర్‌ ఖాతాను నిర్వహించే వాళ్ల పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు. హుడా ట్వీట్‌ వెనుక వేరే ఉద్దేశాలేమైనా ఉన్నాయేమో పరిశీలించి అతడిని మందలించే అవకాశముంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని