close
చెలరేగిన మణిందర్‌

హరియాణాపై బంగాల్‌ విజయం

పుణె: బంగాల్‌ వారియర్స్‌ కెప్టెన్‌ మణిందర్‌ సింగ్‌ (18) మరోసారి రైడింగ్‌లో చెలరేగాడు. తనదైన శైలిలో కూత పెట్టి ప్రత్యర్థి డిఫెండర్లపై ఆధిపత్యం ప్రదర్శించడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగాల్‌ 48-36 తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆ జట్టుకిది వరుసగా నాలుగో విజయం. ఆరంభం నుంచే మణిందర్‌ జోరు మొదలైంది. అతనితో పాటు ట్యాక్లింగ్‌లో బల్దేవ్‌ సింగ్‌ (6) మెరవడంతో తొలి ఆరు నిమిషాలలోపే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన బంగాల్‌ 10-3తో ఆధిక్యం సంపాదించింది. అదే దూకుడు కొనసాగించిన ఆ జట్టు 30-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ద్వితీయార్ధంలో హరియాణా పుంజుకున్నా..  బంగాల్‌ పట్టు వదల్లేదు. చివరికి 12 పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది.

ప్రొ కబడ్డీలో ఈనాడు
టైటాన్స్‌ × పట్నా (రా.7:30 నుంచి)
పుణెరి × బెంగళూరు (రా.8:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.