నూరేద్దాం... సులువుగా!

మసాలా దినుసులను దంచుకోవాలన్నా.. పచ్చడి చేయాలన్నా సాధారణంగా మిక్సీ వాడుతుంటాం. కానీ రెండు మూడు యాలకులనో, లవంగాలనో అప్పటికప్పుడు దంచి వేయాలంటే రాతితో చేసిన చిన్న రోలును వాడుతుంటాం

Updated : 21 Feb 2021 06:04 IST

సౌకర్యం

మసాలా దినుసులను దంచుకోవాలన్నా.. పచ్చడి చేయాలన్నా సాధారణంగా మిక్సీ వాడుతుంటాం. కానీ రెండు మూడు యాలకులనో, లవంగాలనో అప్పటికప్పుడు దంచి వేయాలంటే రాతితో చేసిన చిన్న రోలును వాడుతుంటాం. ఈ ‘రోలింగ్‌ వీల్‌ మోర్టర్‌’తో అదే పనిని మరింత సులువుగా చేయొచ్చు. అలాగే ఎక్కడకైనా దీన్ని తేలిగ్గానూ తీసుకెళ్లొచ్చు కూడా. కొత్తిమీర, పుదీనాలాంటి వాటినీ దీంట్లో వేసి అప్పటికప్పుడు మెత్తని పేస్టులానూ చేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని వంటగదిలో పెట్టుకుంటే చూడచక్కగానూ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని