పూర్ణకుంభం

పూర్ణకుంభం అంటే జలం నింపిన కుండ అనేది సామాన్యార్థం. ఒకప్పుడు రాజులకు పట్టాభిషేకంలో వివిధ నదుల నుంచి తెప్పించిన పుణ్యజలంతో అభిషేకం చేసేవారు.

Published : 15 Jun 2023 00:42 IST

పూర్ణకుంభం అంటే జలం నింపిన కుండ అనేది సామాన్యార్థం. ఒకప్పుడు రాజులకు పట్టాభిషేకంలో వివిధ నదుల నుంచి తెప్పించిన పుణ్యజలంతో అభిషేకం చేసేవారు. అదే కాలక్రమేణ పూర్ణకుంభ వినియోగ సంప్రదాయమైంది. పూర్ణకుంభాన్ని కలశం, కుంభం అంటారు. అందుకు ఇత్తడి కుండ ఉత్తమం. అది అందుబాటులో లేనప్పుడు రాగి, మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. నీళ్లు లేదా బియ్యంతో కుంభాన్ని నింపి తెలుపు లేదా ఎరుపు దారాన్ని కుండ మెడకు కడతారు. కొందరు కుండ మొత్తాన్నీ దారంతో అల్లుతారు. పచ్చటి మామిడాకులను కొంతభాగం కుండలోకి, మరికొంత పైకి కనిపించేట్టుగా వృత్తాకారంలో అలంకరిస్తారు. మధ్యలో టెంకాయ ఉంచి తెల్లటి లేదా పసుపు వస్త్రాన్ని చుడతారు. అలా పూర్ణకుంభం రూపుదాలుస్తుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో దీన్ని పవిత్రమైందిగా భావిస్తారు. పెళ్లి, గృహప్రవేశం, పీఠాధిపతులు, పెద్దలను ఆహ్వానించే కార్యక్రమాల్లో వేద పండితుల మంత్రోచ్చారణ సహితంగా నిర్వహించే పూర్ణకుంభం శుభసూచకం. పూర్వం రాజప్రాకారాల వద్ద స్వాగత సూచకంగా పూర్ణకుంభాలను ఉంచేవారు. ఉమ్మడి ఆంధ్రర్రాష్ట్ర అధికారిక చిహ్నం పూర్ణకుంభం.

 ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని