నీళ్లకుండ చెరువులో పగిలితే..

భారతీయ దార్శనికతను చాటిన సంస్కర్తల్లో సంత్‌ కబీర్‌దాస్‌ ఒకరు. ఆయన ఆధ్యాత్మికంగా, ధార్మికంగా భాసిల్లే నగరం కాశీలో పుట్టారు. కబీర్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప తపస్వి. పరమాత్మ అంశే ఆత్మ అని, శరీరం నశించాక అందులోని ఆత్మ పరమాత్మకు చేరుతుందని వివరించారు.

Published : 22 Jun 2023 00:36 IST

భారతీయ దార్శనికతను చాటిన సంస్కర్తల్లో సంత్‌ కబీర్‌దాస్‌ ఒకరు. ఆయన ఆధ్యాత్మికంగా, ధార్మికంగా భాసిల్లే నగరం కాశీలో పుట్టారు. కబీర్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప తపస్వి. పరమాత్మ అంశే ఆత్మ అని, శరీరం నశించాక అందులోని ఆత్మ పరమాత్మకు చేరుతుందని వివరించారు.
జల్‌ మే కుంభ్‌ హై,కుంభ మే జల్‌
బాహర్‌ భీతర్‌ పాని, జాబ్‌ కూంభ్‌
ఫుటై జల్‌ జల్‌ హి సమాయ్‌
ఇత్‌ తథ్య కొ జానై గ్యాని

నీళ్లతో నిండిన కుండ చెరువులో పగిలితే అందులోని నీళ్లు బయటి నీళ్లతో కలిసిపోయినట్లు శరీరం నశించినపుడు ఆత్మ పరమాత్మతో మమేకం అవుతుంది.
కస్తూరి కుండల్‌ బసై
మృగ డుంఢైబాన్‌ మాహి
అయిసే ఘట ఘట రామ్‌ హైన్‌
దునియా దేఖత్‌ నాహిన్‌

సుగంధ ద్రవ్యం తన నాభిలోనే ఉందని తెలియక ఆ పరిమళం కోసం అడమంతా తిరిగే కస్తూరి మృగం లాగా.. జీవి కూడా నిరాకారుడైన పరమాత్ముడి అంశ తనలోనే ఉందని గుర్తించలేక ఎక్కడెక్కడో తిరుగు తున్నాడు. నలుదిక్కులా అన్వేషిస్తున్నాడని కబీర్‌దాస్‌ ఈ దోహాలో చెప్పారు.
డా.నరసింహరావు కల్యాణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని