రాముడు ఎలా అవతరించాడంటే..

అగ్నిపురాణం పలు అవతారాలను సంక్షిప్తంగా వివరించింది. రామావతారాన్ని మాత్రం పంచమ అధ్యాయం మొదలుకొని ఒక్కో కాండకు ఒక్కో అధ్యాయం చొప్పున ఏడు అధ్యాయాల్లో విపులంగా, రమ్యంగా చిత్రించింది.

Published : 20 Jul 2023 01:11 IST

అగ్నిపురాణం పలు అవతారాలను సంక్షిప్తంగా వివరించింది. రామావతారాన్ని మాత్రం పంచమ అధ్యాయం మొదలుకొని ఒక్కో కాండకు ఒక్కో అధ్యాయం చొప్పున ఏడు అధ్యాయాల్లో విపులంగా, రమ్యంగా చిత్రించింది. రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో అతిశయం లేదు మరి.

విష్ణుమూర్తి నాభిలోని పద్మం నుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కశ్యపుడు, అతడికి సూర్యుడు, ఆయనకు వైవస్వత మనువు, మనువుకు ఇక్ష్వాకుడు జన్మించారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కుకుత్థ్సుడికి రఘువు, రఘువుకు అజుడు, అతడికి దశరథుడు జన్మించారు.

దశరథ మహారాజు రుష్యశృంగుడి సహాయంతో చేసిన యజ్ఞంలో లభించిన పాయసం కౌసల్యాదులకు పంచిపెట్టాడు. ఆ ప్రసాదం సేవించగా రామాదులు జన్మించారు. శ్రీమహావిష్ణువే రావణాదులను వధించేందుకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా నాలుగు విధాలై జన్మించాడు.

తండ్రి మాట జవదాటని ప్రియపుత్రుడిగా, ఆదర్శ సోదరుడిగా, ఏకపత్నీ వ్రతుడిగా, దేశాన్ని సుభిక్షంగా పాలించిన రాజుగా శ్రీరాముడు పూజలందుకున్నాడు. అందుకే రాముని మించిన దైవం లేదంటారు.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ రామనామాన్ని స్మరించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని