కన్నతల్లితో కిరీటధారణ

నెపోలియన్‌ సామాన్య సైనికుడి స్థాయి నుంచి చక్రవర్తిగా ఎదిగాడు. మహారాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్న రోజున... సభా ప్రదేశమంతా సిద్ధమైంది.

Published : 27 Jul 2023 00:07 IST

నెపోలియన్‌ సామాన్య సైనికుడి స్థాయి నుంచి చక్రవర్తిగా ఎదిగాడు. మహారాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్న రోజున... సభా ప్రదేశమంతా సిద్ధమైంది. ప్రధాన ఆసనంలో ఆనాటి సంప్రదాయం ప్రకారం మతాధికారి కూడా ఆసీనుడయ్యారు. ప్రముఖులు, సాధారణ ప్రజలు.. వేలాది మంది హాజరయ్యారు. నెపోలియన్‌ మాతృమూర్తి లెటిజియా రోమోలినో కూడా సభికుల్లో కూర్చొని ఉన్నారు. ఇంతలో నెపోలియన్‌కి కిరీటధారణ చేయాల్సిందిగా సభాధ్యక్షులు మతాధికారిని ఆహ్వానించారు. వెంటనే నెపోలియన్‌ వినమ్రంగా లేచి నిలబడి ‘మీరు నాపై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. నేనీ స్థాయికి వచ్చానంటే.. దాని వెనుక నా మాతృమూర్తి కృషి చాలా ఉంది. నాకోసం ఆవిడ తన యావత్‌ జీవితాన్నీ త్యాగం చేసింది. నాకెంతో స్ఫూర్తినిచ్చిన అమ్మ చేతుల మీదుగా ఈ కిరీటాన్ని ధరించాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థనను మన్నించండి’ అని వేడుకున్నాడు. మతాధికారి ఆనందంగా అందుకు అంగీకరించడమే కాదు.. తల్లిని మించిన దైవం లేదని, మాతృమూర్తి పట్ల ప్రేమ, ఆరాధనలు చూపిస్తున్న నెపోలియన్‌ అందరికీ ఆదర్శమని ప్రశంసించారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని