స్తుతిస్తే చాలా?!

మనదేశంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆ ఏడాదే వారణాసిలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. తమిళ ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతి కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు.

Published : 07 Sep 2023 02:02 IST

నదేశంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆ ఏడాదే వారణాసిలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. తమిళ ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతి కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మద్రాసుకు తిరిగొస్తూ మార్గమధ్యంలో కలకత్తా సందర్శించారు. యాదృచ్ఛికంగా సోదరి నివేదితను కలుసుకున్నారు. ఇద్దరూ సామాజిక, రాజకీయ, సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై చర్చించుకున్నారు. మాటల మధ్యలో ‘మీ భార్య రాలేదా?’ అనడిగిందామె. ‘ఆమె బయటకు రాదు. అయినా ఆడవాళ్లకు సభలూ, సమావేశాలెందుకు?’ అన్నారాయన నిరాసక్తంగా. నివేదిత ఆశ్చర్యంగా ‘అయితే ఆంగ్లేయుల నుంచి మీరు కోరుకుంటున్న స్వాతంత్య్రం మీ దేశంలోని 50 శాతం ప్రజలకే అన్నమాట! మిగతా అర్ధభాగానికి అవసరం లేదేమో!’ అన్నారు. ఆమె ఎందుకలా ఎగతాళి చేస్తున్నదో అర్థంకాక అయోమయంగా చూస్తోంటే.. ‘మీ దేశంలో దేవతలను పూజిస్తారు. కానీ స్త్రీలను మీతో సమానంగా చూడరు. స్వతంత్రం మీకే గానీ వాళ్లకు ఉండకూడదు. శ్లోకాల్లో, స్తోత్రాల్లో మహిళలను అర్చిస్తారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. ఇదేం ద్వంద్వ రీతి?!’ అన్నారు సోదరి నివేదిత. ఆమె మాటలు కనువిప్పును కలిగించాయి. మద్రాసు వెళ్లాక సుబ్రహ్మణ భారతి భార్య చెల్లమ్మతో బయటకు వెళ్లటం అలవాటుగా చేసుకున్నారు. సోదరి నివేదితతో చారిత్రాత్మక సమావేశం తనపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పేవారాయన. 

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని