భార్యాపిల్లలు ఎక్కడివారు?
భజగోవిందంలో శంకరాచార్యులు చెప్పిన ఈ శ్లోకంలో అర్థం కంటే అంతరార్థం చాలా గొప్పది. భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలియదు. పోనీ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు? అదీ తెలియదు.
కాతే కాంతా కస్తే పుత్రః
సంసారో య మతీయ విచిత్రః,
కస్య త్వం కః కుత అయాతః
తత్త్వం చింతయ తదియ భ్రాతః
భజగోవిందంలో శంకరాచార్యులు చెప్పిన ఈ శ్లోకంలో అర్థం కంటే అంతరార్థం చాలా గొప్పది. భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలియదు. పోనీ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు? అదీ తెలియదు. భార్యాబిడ్డలే సంసారంగా భావిస్తారు కదా! ఈ జీవయాత్ర ఎప్పటికి ముగుస్తుంది? ఎన్నాళ్లీ ప్రయాణం? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే.. తల్లి గర్భం నుంచి వచ్చానంటావు. అంతకంటే ముందు ఎక్కడున్నావు? ఎన్నాళ్లీ ప్రయాణం, ఎప్పటికి ఈ యాత్ర ఆగుతుంది- ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ జీవన సత్యాలు గ్రహించగలిగితేనే ఈ జన్మలో కాకున్నా.. తర్వాతైనా ఈశ్వర సన్నిధికి చేరుకోగలుగుతాం. శరీరంతో వచ్చిన సంబంధాలన్నీ ఆ దేహంతోనే అంతమవుతాయి. కాలానికి ఉన్న గుణం.. నశింప చేయడమే! శంకరులవారు- ‘జగద్భక్షకః కాలం’ అన్నారు. కాలం జగత్తును పుట్టిస్తుంది, తినేస్తుంది. కనుక కాలం ముందు తల వంచక తప్పదు. అయితే ఈ శరీరం ఉండగానే బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నించాలి. కాలాన్ని గెలిచినవారు లేరు. కాలం ఈశ్వర స్వరూపమై చేసే హెచ్చరికలను జాగ్రత్తతో వ్యవహరిస్తూ గ్రహించాలి.
డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్