కృష్ణుడెందుకు నల్లగా..

స్వామి వివేకానంద ఒకసారి మద్రాసు వచ్చారు. అక్కడి న్యాయ కళాశాలలో ఆయనకు బస ఏర్పాటయింది. వసతి గృహంలోని గదులన్నీ పరిశీలిస్తూ విద్యార్థులతో సంభాషిస్తున్నారు. అలా ఒక గదిలో గోడమీదున్న పటం చూస్తూ ‘అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు నీలవర్ణంలో ఎందుకున్నాడో తెలుసా?’ అనడిగారు అక్కడున్న ఓ విద్యార్థిని.

Published : 16 Nov 2023 00:16 IST

వివేకచూడామణి

స్వామి వివేకానంద ఒకసారి మద్రాసు వచ్చారు. అక్కడి న్యాయ కళాశాలలో ఆయనకు బస ఏర్పాటయింది. వసతి గృహంలోని గదులన్నీ పరిశీలిస్తూ విద్యార్థులతో సంభాషిస్తున్నారు. అలా ఒక గదిలో గోడమీదున్న పటం చూస్తూ ‘అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు నీలవర్ణంలో ఎందుకున్నాడో తెలుసా?’ అనడిగారు అక్కడున్న ఓ విద్యార్థిని.

వెంటనే ఆ విద్యార్థి ‘సముద్రం, ఆకాశం రెండూ అనంతమైనవి. రెండూ నీలి వర్ణంలోనే ఉంటాయి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు.. అనంతులు అని సూచించ డానికే వారి మేనిఛాయ నీలవర్ణంలో ఉంది స్వామీ’ అంటూ బదులిచ్చాడు.

ఆ మాటలు విన్న వివేకానంద చిరునవ్వు చిందించి, ‘నీలో చురుకుదనం ఉంది. జగద్విఖ్యాతి పొందుతావు’ అని దీవించారు.
స్వామి వివేకానందను మెప్పించిన ఆ కుర్రాడు మరెవరో కాదు.. అందరిచేతా ఆప్యాయంగా ‘రాజాజీ’ అని పిలిపించుకున్న చక్రవర్తుల రాజగోపాలాచారి.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని