నోటీస్‌బోర్డు

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 05 Jul 2021 00:40 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీపీ పోస్టులు

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 151 (మల్టీ జోన్‌-1: 68, మల్టీ జోన్‌-2: 83) అర్హత: ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ లా (ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌)/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.  04 జులై 2021 నాటికి అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్‌ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తుండాలి. వయసు: 01.07.2021 నాటికి 34 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
వెబ్‌సైట్‌: www.tslprb.in/

ఏపీ హైకోర్టులో 25 ఖాళీలు

మరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఒప్పంద ప్రాతిపదికన జడ్జీలకి, రిజిస్ట్రార్‌లకి సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు

మొత్తం ఖాళీలు: 25 అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌లో డిగ్రీ (లేదా) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180, 150 పదాలు), కంప్యూటర్‌ స్కిల్స్‌. వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకి రూ.37,100 చెల్లిస్తారు.  ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ఓరల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: 2021, జులై 21. చిరునామా: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు 522237. వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

ఐఐటీఎం-పుణెలో 156 పోస్టులు

భారత ప్రభుత్వ ఎర్త్‌సైన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటియోరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 156 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ కన్సల్టెంట్‌ తదితరాలు. అర్హత:  పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 01.
వెబ్‌సైట్‌: www.tropmet.res.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని