నోటిఫికేషన్స్

రాంచీ (ఝార్ఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ 2023-2025 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ స్పాన్సర్డ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 09 Aug 2023 04:06 IST

ప్రవేశాలు

ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీ, రాంచీలో ఎంటెక్‌

రాంచీ (ఝార్ఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ 2023-2025 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ స్పాన్సర్డ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: ఫౌండ్రీ-ఫోర్జ్‌ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఎంపిక: ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-08-2023.
ఇంటర్వ్యూ/ రాత పరీక్ష: 01-09-2023.
తరగతుల ప్రారంభం: 18-09-2023.
వెబ్‌సైట్‌:https://www.niamt.ac.in/


గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది.  
అర్హతలు: ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ సైన్స్‌/ హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థులకు గరిష్ఠ పరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు: రూ.1800 (జనరల్‌ అభ్యర్థులకు), రూ.900 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 24-08-2023.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 29-09-2023.
అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 13-10-2023.
పరీక్ష తేదీలు: 03-02-2024, 04-02-2024, 10-02-2024, 11-02-2024.
పరీక్ష ఫలితాల విడుదల: 16-03-2024.
వెబ్‌సైట్‌: https://gate2024.iisc.ac.in/


మనూలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ (ఆర్‌సీఏ).. సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ)- 2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు వసతి సౌకర్యమూ కల్పిస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 17-09-2023.
ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 25-09-2023.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 3, 4.
తుది ఫలితాల వెల్లడి: 09-10-2023.
అడ్మిషన్‌ తేదీలు: 10-15 అక్టోబర్‌, 2023.
తరగతుల ప్రారంభం: 16-10-2023.
వెబ్‌సైట్‌: https://manuu.edu.in/


అప్రెంటిస్‌షిప్‌

ఏపీఎస్‌ఆర్‌టీసీ- విజయనగరం జోన్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయనగరం జోన్‌... కింది ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది.
ట్రేడులు: డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ వర్కర్‌, మిల్‌ రైట్‌ మెకానిక్‌.
అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
ఎంపిక: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.
సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఫీజు: రూ.118.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2023
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 18-08-2023
విశాఖపట్నం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 19-08-2023
శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 21-08-2023
ధ్రువపత్రాలు పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరం.
వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/


గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌లు

మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), ఎయిర్‌క్రాఫ్ట్‌ డివిజన్‌ 2023-24 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ స్ట్రీమ్‌లో 647 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 186  
2. డిప్లొమా అప్రెంటిస్‌: 111  
3. ఐటీఐ అప్రెంటిస్‌: 350
* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: ఏరోనాటికల్‌, కంప్యూటర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మెకానికల్‌, ప్రొడక్షన్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, ఫార్మసీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌.
* డిప్లొమా అప్రెంటిస్‌: ఏరోనాటికల్‌, సివిల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మెకానికల్‌ ఇంజినీర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌.
* ఐటీఐ అప్రెంటిస్‌: ఫిట్టర్‌, టూల్‌ అండ్‌ డై మేకర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, పెయింటర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, వెల్డర్‌, స్టెనోగ్రాఫర్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌లకు రూ.9,000; డిప్లొమా హోల్డర్లకు రూ.8,000; ఐటీఐ చదివినవారికి రూ.8,000.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-08-2023.
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: సెప్టెంబరు 04 నుంచి 16 వరకు.
వెబ్‌సైట్‌:https://hal-india.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని