నోటిఫికేషన్స్‌

కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 10 Aug 2023 00:03 IST

ఉద్యోగాలు

సాహా ఇన్‌స్టిట్యూట్‌లో..

కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ఇంజినీర్‌ ‘సి’: 02
  • టెక్నీషియన్‌ ‘బి’ (ఎలక్ట్రికల్‌ వైరింగ్‌/ సర్వీసింగ్‌/ మెయింటెనెన్స్‌): 05  
  • టెక్నీషియన్‌ ‘బి’ (ఏసీ మెయింటెనెన్స్‌, ఏసీ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌): 01
  • టెక్నీషియన్‌ ‘బి’ (కంప్యూటర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ పెరిఫెరల్స్‌): 03
  • టెక్నీషియన్‌ ‘బి’ (ట్రేసర్‌/డ్రాఫ్ట్స్‌మన్‌ ఫర్‌ డ్రాయింగ్‌ఆఫీస్‌): 01
  • ఎల్‌డీసీ (లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌): 05

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్‌, డిగ్రీతో పాటు పని అనుభవం.
ఎంపిక: పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-08-2023.
అప్లికేషన్‌ హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06-09-2023.

వెబ్‌సైట్‌: https://www.saha.ac.in/web/job-opportunities

 


శ్రీహరికోటలో పారా మెడికల్‌ పోస్టులు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ 56 పారా మెడికల్‌ పోస్టుల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌: 01
  • నర్స్‌-బి: 07  
  • ఫార్మసిస్ట్‌-ఎ: 02
  • రేడియోగ్రాఫర్‌-ఎ: 04  
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌-ఎ: 01  
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌-ఎ(డెంటల్‌ హైజీనిస్ట్‌): 01
  • అసిస్టెంట్‌ (రాజ్‌భాష): 01  
  • కుక్‌: 04  
  • లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌- ఎ: 13  
  • హెవీ వెహికల్‌ డ్రైవర్‌-ఎ: 14
  • ఫైర్‌మ్యాన్‌-ఎ: 08 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌.
వయసు: 24.08.2023 నాటికి అసిస్టెంట్‌ ఖాళీలకు 18-28 ఏళ్లు; ఫైర్‌మ్యాన్‌ 18-25 ఏళ్లు; ఇతర పోస్టులకు 18-35 సంవత్సరాల మధ్య.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 24.08.2023.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25.08.2023.

వెబ్‌సైట్‌: https://www.shar.gov.in/sdscshar/index.jsp


ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీల్లో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 

ఫ్యాకల్టీలు: సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీతో పాటు (యూజీసీ)- జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) సాధించినవారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్‌ పొందినవారు.
దరఖాస్తు: యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, ధ్రువపత్రాల నకళ్లను హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని సంబంధిత విభాగాల డీన్‌ కార్యాలయాలకు పంపించాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-08-2023.

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/


ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌... దూరవిద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ  ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌; ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా. టీఎస్‌/ ఏపీ ఐసెట్‌-2023లో అర్హత సాధిస్తే ఎంబీఏ, ఎంసీఏల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.900.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2023.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 18-08-2023.

వెబ్‌సైట్‌: http://www.oucde.net/


యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో...

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 

కోర్సులు: ఎంఎస్సీ, ఎంపీహెచ్‌, ఎంఏ, ఎంఈడీ, ఎంపీఏ, ఎంవీఏ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పీహెచ్‌డీ
సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ బయాలజీ, యానిమల్‌ బయాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఇంగ్లిష్‌, హిందీ, ఫిలాసఫీ, తెలుగు తదితరాలు.
మొత్తం సబ్జెక్టులు: 45
మొత్తం సీట్ల సంఖ్య: 1346.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు సీయూఈటీ (పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ సీయూఈటీ (పీజీ)- 2023 స్కోర్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.300; ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.200; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.125.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-08-2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 21-08-2023.
ఇంటర్వ్యూ తేదీలు: 30-08-2023 నుంచి 01-09-2023 వరకు.
అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీ: 14-09-2023.
ఇంటర్వ్యూ లేని పీజీ ప్రోగ్రామ్‌ అడ్మిషన్‌ షెడ్యూల్‌:
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:
12-08-2023.
అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీ: 11, 12, 13-09-2023.

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని