ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(నిర్డ్‌ పీఆర్‌).. 172 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 15 Aug 2023 00:04 IST

నిర్డ్‌లో 172 పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(నిర్డ్‌ పీఆర్‌).. 172 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సీనియర్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌: 24
  • కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌: 148

అర్హత: ఏదైనా విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.

వయసు: 17.08.2023 నాటికి 62 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.08.2023.

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/


నేవీలో ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు

ఇండియన్‌ నేవీ.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి)లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకానికి సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ)లో జనవరి 2024 నుంచి స్పెషల్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్సు ప్రారంభం కానుంది.

మొత్తం పోస్టులు: 35

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ.

వయసు: 02-01-1999 నుంచి 01-07-2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: విద్యార్హతల్లో సాధించి మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-08-2023.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


ఎయిమ్స్‌లో..  

రాయ్‌బరేలీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. తాత్కాలిక ప్రాతిపదికన 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌

వయసు: 37 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,000; ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.800, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-08-2023.

రాత పరీక్ష తేదీ: 20-08-2023.

వెబ్‌సైట్‌: http://recruitment.aiimsrbl.edu.in/


ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు

నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ (ఎన్‌హెచ్‌ఐటీ) 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ సీఏ ఇంటర్‌/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: career@nhit.co.in

దరఖాస్తుకు చివరి తేదీ: 23.08.2023.

వెబ్‌సైట్‌: http://nhit.co.in/


స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో  టెక్నీషియన్లు
హ్మదాబాద్‌లోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) 35 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, మెకానికల్‌, కెమికల్‌, టర్నర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ.

వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023

వెబ్‌సైట్‌: https://www.sac.gov.in/Vyom/careers/ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని