నోటిఫికేషన్స్‌

కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో వివిధ స్పెషాలిటీల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 Aug 2023 00:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
కడప ఆసుపత్రిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో వివిధ స్పెషాలిటీల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: గైనకాలజీ, అనస్థీషియా, రేడియో డయాగ్నోసిస్‌, సైకియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, అనాటమీ

అర్హత: మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ).

ఎంపిక: పీజీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-08-2023.

రిక్రూట్‌మెంట్‌ వాక్‌ ఇన్‌ తేదీ: 21-08-2023.

స్థలం: కౌన్సిల్‌ హాల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, కడప.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/


ప్రవేశాలు

నిమ్స్‌, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 30

సబ్జెక్టులు: న్యూరాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, పల్మనరీ మెడిసిన్‌, క్లినికల్‌ ఫార్మకాలజీ అండ్‌ థెరప్యూటిక్స్‌, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్‌ అంకాలజీ, అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్‌ కేర్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ. జాతీయ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధిస్తే స్క్రీనింగ్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-08-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 09-09-2023.

ఫలితాల ప్రకటన: 13-09-2023.

ఇంటర్వ్యూ తేదీలు: 19, 20, 21-09-2023.

ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి: 25-09-2023

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/


నేషనల్‌ లా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం (ప్రొఫెషనల్‌)

న్యూదిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ దిల్లీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎల్‌ఎల్‌ఎం (ప్రొఫెషనల్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్‌: క్రిమినల్‌ లా, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ స్టడీస్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, కమర్షియల్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌   లా అండ్‌ జస్టిస్‌, కన్‌జ్యూమర్‌ లా, హెల్త్‌ లా అండ్‌ పాలసీ, టాక్సేషన్‌ లా.

అర్హత: కనీసం 50% మార్కులతో డిగ్రీ/ పీజీతో పాటు కనీసం మూడేళ్ల పాటు వృత్తిపరమైన పని అనుభవం.

ఎంపిక: డిగ్రీ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-08-2023.


డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

న్యూదిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ దిల్లీ 2024-25 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది.

1. ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌): 120 సీట్లు

అర్హత: సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ (10+2) ఉత్తీర్ణత.

2. ఏడాది ఎల్‌ఎల్‌ఎం: 80 సీట్లు

అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానమైన లా డిగ్రీ.

3. పీహెచ్‌డీ (లా, సోషల్‌ సైన్సెస్‌) ప్రోగ్రామ్‌: 31 సీట్లు

అర్హత: ఎల్‌ఎల్‌ఎం/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమానమైన డిగ్రీ.

సీట్ల కేటాయింపు: ఆల్‌ ఇండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్‌- 2024 ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.3500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2023

అడ్మిట్‌ కార్డుల జారీ: 20-11-2023.

ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 10-12-2023.

వెబ్‌సైట్‌: https://nludelhi.ac.in/home.aspx


స్కాలర్‌షిప్‌లు

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది. సంబంధిత ప్రకటనను ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం విడుదల చేసింది.

ఏడాదికి రూ.12 వేలు: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

అర్హతలు:

  • ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
  • ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదువుతూ ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

ఎంపిక: రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్ష ద్వారా.

దరఖాస్తు: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15-09-2023.

సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 16-09-2023.

దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేదీ: 19-09-2023.

డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం గడువు: 22-09-2023.

వెబ్‌సైట్‌: https://www.bse.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని