నోటిఫికేషన్స్‌

గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 17 Aug 2023 05:45 IST

ప్రవేశాలు

ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌లో పీహెచ్‌డీ

గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సబ్జెక్టులు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్‌ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ కేటగిరీకి రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగులకు ఫీజు  మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 31/08/2023.
అడ్మిట్‌ కార్డ్‌ విడుదల: 20/09/2023.
రాత పరీక్ష తేదీ: 03/10/2023.
వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/


డా.వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూలో బీఆర్క్‌ డిగ్రీ

కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఏపీలోని ప్రభుత్వ/ ప్రైవేటు/ మైనారిటీ/ అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ బయాలజీ తదితర ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నాటా- 2023/ జేఈఈ (మెయిన్‌) బీఆర్క్‌ పేపర్‌-2ఎ 2023 ఎగ్జామ్‌లో స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక: నాటా-2023/ జేఈఈ (మెయిన్‌) బీఆర్క్‌ పేపర్‌-2ఎ 2023 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500, బీసీలకు రూ.1300, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 24-08-2023.
సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీ: 25-08-2023 నుంచి 28-08-2023 వరకు.
వెబ్‌ ఆప్షన్స్‌ తేదీలు: సెప్టెంబరు 04, 05.
మొదటి విడత]ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07-09-2023.
వెబ్‌సైట్‌: https://apsche.ap.gov.in/arch/


ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)- ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, బాబా భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందవచ్చు. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఆయా వర్సిటీల్లో సీటు కేటాయిస్తారు.
విభాగాలు: కామర్స్‌, ఫైనాన్స్‌, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌, సైన్సెస్‌, ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.  
వయసు: వయః పరిమితి నిబంధనలు లేవు.
దరఖాస్తు రుసుము (ఒక పరీక్ష పేపర్‌): జనరల్‌ రూ.1200; ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌ రూ.1100; ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌ జెండర్‌, దివ్యాంగులకు రూ.1000.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 09.09.2023 నుంచి 11.09.2023 వరకు.
వెబ్‌సైట్‌: https://www.nta.ac.in/


అప్రెంటిస్‌షిప్‌

వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో  గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌  గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 316 పోస్టులు.

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 101  
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 215  

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌.
విభాగాలు: మైనింగ్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌, మైన్‌ సర్వేయింగ్‌.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01-09-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-09-2023.
వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php


875 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని  వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్‌అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

  • ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 815

ట్రేడులు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, సర్వేయర్‌, మెకానిక్‌ డీజిల్‌, వైర్‌మ్యాన్‌, డ్రాఫ్ట్స్‌మన్‌ (సివిల్‌), పంప్‌ ఆపరేటర్‌ అండ్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌.

  • సెక్యూరిటీ గార్డ్‌: 60  

అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
వయసు: 16-09-2023 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: రూ.7700 నుంచి రూ.8050 (ఫ్రెషర్లకు రూ.6000).
ఎంపిక: దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు  ప్రారంభం: 01-09-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-09-2023.
వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని