నోటిఫికేషన్స్‌

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 21 Aug 2023 03:23 IST

ప్రవేశాలు
సంస్కృత విశ్వవిద్యాలయంలో పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్స్‌

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. పీజీ డిప్లొమా: యోగా థెరపీ, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌, యోగా విజ్ఞాన, కర్మకాండ, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, వెబ్‌ టెక్నాలజీ.
వ్యవధి: రెండేళ్లు.

2. డిప్లొమా: టెంపుల్‌ కల్చర్‌, కర్మకాండ, జ్యోతిష అండ్‌ వాస్తు, ట్రాన్స్‌లేషన్‌. వ్యవధి: ఏడాది.

3. సర్టిఫికెట్‌: టెంపుల్‌ కల్చర్‌, కర్మకాండ, జ్యోతిష, కమ్యూనికేటివ్‌ అండ్‌ ఫంక్షనల్‌ సంస్కృతం, ట్రాన్స్‌లేషన్‌, మ్యూజిక్‌ (ఓకల్‌), డ్యాన్స్‌ (భరతనాట్యం), సితార్‌. వ్యవధి: 6 నెలలు

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఆచార్య, విద్యావారధి.

ఎంపిక: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష/ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-08-2023.

వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/


ఉద్యోగాలు

ఎస్‌బీఐలో క్రెడిట్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌లు

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన 3 క్రెడిట్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)/ ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌)తో పాటు కార్పొరేట్‌ ఫైనాన్స్‌/ కార్పొరేట్‌ క్రెడిట్‌ రంగంలో కనీసం అయిదేళ్ల పని అనుభవం.

వయసు: 01.04.2023 నాటికి 27- 37 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 29.08.2023.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/current-openings


ముంబయి ఎస్‌బీఐలో ఫ్యాకల్టీ

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌) పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో కనీసం మూడేళ్ల బోధనానుభవం.

వయసు: 31.05.2023 నాటికి 28 - 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

పని ప్రదేశం: ఎస్‌బీఐఎల్‌, కోల్‌కతా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 29.08.2023.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/current-openings


ఒంగోలులో సైకియాట్రిస్ట్‌, వార్డ్‌ బాయ్‌ పోస్టులు

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, డి-అడిక్షన్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైకియాట్రిస్ట్‌/ ఎంబీబీఎస్‌ డాక్టర్‌: 01

వార్డ్‌ బాయ్స్‌: 01

కౌన్సెలర్‌: 01

అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, 8వ తరగతి, డిగ్రీతోపాటు పని అనుభవం.

వయసు: 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, ఒంగోలు’లో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 28-08-2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


పశ్చిమ గోదావరి జిల్లాలో  ఈ-డిస్ట్రిక్ట్‌  మేనేజర్‌లు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన 2 ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: బీసీఏ/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/పీజీతో పాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.

వయసు: 01.07.2022 నాటికి 21- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

పని ప్రదేశం: కలెక్టరేట్‌ (పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం), రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం (భీమవరం డివిజన్‌).

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్‌, పశ్చిమగోదావరి, భీమవరం’ చిరునామాలో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 25-08-2023.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


కృష్ణా జిల్లాలో ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌లు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: బీసీఏ/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ పీజీతో పాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.

వయసు: 01.07.2022 నాటికి 21- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

పని ప్రదేశం: కలెక్టరేట్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘కలెక్టరేట్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా ’ చిరునామాలో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-08-2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/


వాక్‌ ఇన్‌

కర్నూలు జిల్లాలో డీఈవో, స్టాఫ్‌ నర్స్‌లు

కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో కింది పోస్టుల భర్తీ చేయబోతోంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01

లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌: 01

స్టాఫ్‌ నర్స్‌: 01

అర్హతలు: పోస్టుననుసరించి టెన్త్‌, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌).

వయసు: వయసు 01.07.2023నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 23.08.2023.

వేదిక: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కర్నూలు.

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని