నోటిఫికేషన్స్

పంచకులలోని ప్రభుత్వరంగ సంస్థ- భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 57 పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 23 Aug 2023 03:36 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌, పంచకులలో ఇంజినీర్‌ పోస్టులు

పంచకులలోని ప్రభుత్వరంగ సంస్థ- భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 57 పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ట్రైనీ ఇంజినీర్‌: 36  
2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ ఆఫీసర్‌: 21
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీహెచ్‌ఆర్‌ఎంతో పాటు పని అనుభవం.  
వయసు: 01-08-2023 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 32 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.472; ట్రైనీ ఇంజినీర్‌కు రూ.177.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ: 26.08.2023. 

వెబ్‌సైట్‌:https://bel-india.in/


ప్రవేశాలు

ఎయిమ్స్‌ రాయ్‌పుర్‌లో ఎంపీహెచ్‌ ప్రోగ్రామ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పుర్‌లోని ఎయిమ్స్‌.. రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీట్లు: 06
అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీఈ, బీటెక్‌, బీవీఎస్సీ, నర్సింగ్‌ సైన్సెస్‌, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, ఫార్మసీ కోర్సుల్లో ఒకటి. లేదా పీజీ (స్టాటిస్టిక్స్‌/ బయోస్టాటిస్టిక్స్‌/ డెమోగ్రఫీ/ పాపులేషన్‌ స్టడీస్‌/ న్యూట్రిషన్‌/ సోషియాలజీ/ ఎకనామిక్స్‌/ సైకాలజీ/ ఆంత్రొపాలజీ/ సోషల్‌ వర్క్‌/ మేనేజ్‌మెంట్‌/ లా) .
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ కేటగిరీకి రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 25.08.2023.
పరీక్ష తేదీ: 10.09.2023.
వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/


వైకుంఠ మెహతా సంస్థలో పీజీ డిప్లొమా

పుణెలోని వైకుంఠ మెహతా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌- పీజీ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ కోఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీ డీసీబీఎం)    మొత్తం సీట్లు: 30
కోర్సు వ్యవధి: 36 వారాలు.
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ. సహకార సంస్థలు/ ప్రభుత్వ శాఖలు/ సహకార బ్యాంకుల్లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-08-2023.
వెబ్‌సైట్‌: https://vamnicom.gov.in/


ఏయూ దూరవిద్యలో ఆన్‌లైన్‌ డిగ్రీ, పీజీ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆన్‌లైన్‌ విధానంలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఆన్‌లైన్‌  యూజీ: బీఏ (హెచ్‌ఈపీ), బీకాం, బీకాం (అకౌంటెన్సీ) వ్యవధి: మూడేళ్లు
2. ఆన్‌లైన్‌ పీజీ: ఎంఏ (ఎకనామిక్స్‌/ హెచ్‌ఆర్‌ఎం/ జేఎంసీ/ ఇంగ్లిష్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ సోషియాలజీ), ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ. వ్యవధి: రెండేళ్లు
3. అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ: బీకాం, బీఏ, ఎంకాం, ఎంఏ (ఎకనామిక్స్‌/ పొలిటికల్‌ సైన్స్‌)
అర్హత: కోర్సును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2023
వెబ్‌సైట్‌: https://www.andhrauniversity.edu.in/


జేఎన్‌టీయూ కాకినాడలో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ

కాకినాడలోని జేఎన్‌టీయూ స్పాన్సర్డ్‌ విభాగంలో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాకినాడ, నరసరావుపేట క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
సీట్లు: ఎంటెక్‌కు సంబంధించి ఒక్కో స్పెషలైజేషన్‌లో 5 సీట్లు, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో 5 సీట్లు, ఎంబీఏ ప్రోగ్రామ్‌లో 9 సీట్లు ఉన్నాయి.
అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ. రిజర్వ్‌డ్‌ కేటగిరీల వారికి 45% మార్కులు. గేట్‌ 2023/ జీప్యాట్‌ 2023/ ఐసెట్‌ 2023/ పీజీఈసెట్‌ 2023 ర్యాంకు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, గేట్‌ 2023/ జీప్యాట్‌ 2023/ ఐసెట్‌ 2023/ పీజీఈసెట్‌ 2023 ర్యాంకు, పని అనుభవం, కౌన్సెలింగ్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2023.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్‌, అడ్మిషన్స్‌, జేఎన్‌టీయూ కాకినాడ.    

వెబ్‌సైట్‌: https://www.jntuk.edu.in/


కేవీకే పాలెంలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 6 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 05    యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 01

అర్హత: డిప్లొమా/ డిగ్రీ/ పీజీ (అగ్రికల్చర్‌ సైన్సెస్‌)తో పాటు పని అనుభవం.     ఇంటర్వ్యూ తేదీ: 24.08.2023.
స్థలం: కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం.
వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


అప్రెంటిస్‌షిప్‌

హెచ్‌ఏఎల్‌లో 1,060 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌లో 1060 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
ట్రేడ్స్‌: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, సీవోపీఏ, ఫౌండ్రీ-మ్యాన్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌.
అర్హత: పదోతరగతితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీంలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: పదో తరగతి మార్కులు (70% వెయిటేజీ), సీటీఎస్‌ ఐటీఐ పరీక్ష (30% వెయిటేజీ) మార్కుల ఆధారంగా.
టీటీఐ/ హెచ్‌ఏఎల్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2023.
వెబ్‌సైట్‌:https://hal-india.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని