నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని నిమ్స్‌.. నెఫ్రాలజీలో ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 24 Aug 2023 03:09 IST

ప్రవేశాలు
ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని నిమ్స్‌.. నెఫ్రాలజీలో ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సీట్లు: 04. వ్యవధి: ఒక సంవత్సరం.

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌), బీఎస్సీ (సైకాలజీ), బీఎస్సీ (లైఫ్‌ సైన్సెస్‌), బీఎస్సీ (డయాలసిస్‌ టెక్నాలజీ), ఎంబీబీఎస్‌/ ఎండీ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)లలో ఏదో ఒకటి.

వయసు: డిసెంబర్‌ 31, 2023 నాటికి 20- 50 ఏళ్ల మధ్య.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5,000; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.4,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 22-09-2023.

తరగతుల ప్రారంభం: 10-10-2023.

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/


కేయూ దూరవిద్యలో యూజీ, పీజీ

వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ దూరవిద్య విధానంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. డిగ్రీ: బీకాం(జనరల్‌)/ బీకాం (కంప్యూటర్స్‌)/ బీబీఏ/ బీఎస్సీ (మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ బీఎల్‌ఐఎస్సీ.

వ్యవధి: మూడేళ్లు.

2. పీజీ: ఎంఏ (ఇంగ్లిష్‌/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌).

వ్యవధి: రెండేళ్లు.

3. డిప్లొమా: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ రిటైల్‌ మార్కెటింగ్‌/ ట్యాలీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌/ గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌/ పీడీ అండ్‌ సి స్కిల్స్‌.

వ్యవధి: ఒక ఏడాది

4. సర్టిఫికెట్‌: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌

5. ఓరియెంటేషన్‌ ప్రోగ్రాం: మిమిక్రీ/ ఓకల్‌ మ్యూజిక్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మ్యూజిక్‌/ సాఫ్ట్‌ స్కిల్స్‌.

వ్యవధి: 3 నెలలు

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2023.

వెబ్‌సైట్‌: http://sdlceku.co.in/


కాళోజీ వర్సిటీలో బీఎస్సీ నర్సింగ్‌

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అర్హత: ఇంటర్మీడియట్‌ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) లేదా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంకు సాధించి ఉండాలి.

వయసు: 31-12-2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక: టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంకు, రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2,500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2023.

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/


పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌

రెండేళ్ల వ్యవధి ఉండే పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అర్హత: ఇంటర్‌తో పాటు జీఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణులైన మహిళలు

వయసు: 02-01-2003 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక: ఇంటర్‌, జీఎన్‌ఎం విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2,500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000). ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2023.

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/


ప్రభుత్వం ఉద్యోగాలు

రైట్స్‌ లిమిటెడ్‌లో..

గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన 16 జూనియర్‌ అసిస్టెంట్‌ (హెచ్‌ఆర్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌.

వయసు: 01.08.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.09.2023.

వెబ్‌సైట్‌: https://www.rites.com/


నిట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) 150 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • జూనియర్‌ ఇంజినీర్‌- 7
  • సూపరింటెండెంట్‌- 10
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌- 30
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌- 3
  • సీనియర్‌ అసిస్టెంట్‌- 10
  • సీనియర్‌ టెక్నీషియన్‌- 14
  • జూనియర్‌ అసిస్టెంట్‌- 24
  • టెక్నీషియన్‌- 30
  • ఆఫీస్‌ అటెండెంట్‌- 7
  • ల్యాబ్‌ అటెండెంట్‌- 15

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2023.

వెబ్‌సైట్‌: https://nitc.ac.in/


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

కేవీకే కంపసాగర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం 8 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 07
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 01

అర్హత: డిప్లొమా/ గ్రాడ్యుయేట్‌/ పీజీ (అగ్రికల్చర్‌ సైన్సెస్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 28.08.2023.

స్థలం: కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్‌.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని