ప్రభుత్వ ఉద్యోగాలు

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 95 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 29 Aug 2023 00:28 IST

బెల్‌-ఘజియాబాద్‌లో 95 పోస్టులు                

జియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 95 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ట్రెయినీ ఆఫీసర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌

విభాగాలు: మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

అనుభవం:  2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 28-32 ఏళ్లు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: 1. ట్రెయినీ ఇంజినీర్‌: రూ.150. 2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: రూ.400.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.09.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/


సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన హైదరాబాద్‌ జిల్లాలోని టీవీవీపీ హాస్పిటల్స్‌లో 69 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషాలిటీ: ఓబీ అండ్‌ జీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ సర్జరీ, పాథాలజీ.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో మెడికల్‌ పీజీ/ డీఎన్‌బీ/ డిప్లొమా.

వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: పీజీ/ డీఎన్‌బీ/ డిప్లొమా మార్కులు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌, నాలుగో అంతస్తు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఖైరతాబాద్‌’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2023.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


ఎంఈసీఎల్‌-నాగ్‌పుర్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు  

నాగ్‌పుర్‌లోని మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌) ఆధ్వర్యంలో ఉన్న మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అకౌంటెంట్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, టెక్నీషియన్‌, అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌.

విభాగాలు: హిందీ, హెచ్‌ఆర్‌, అకౌంట్స్‌, మెటీరియల్స్‌, ల్యాబొరేటరీ, సాంప్లింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ ఐటీఐ/ బీఎస్సీ/ బీఏ/ బీకాం/ బీబీఏ/బీబీఎం/బీఎస్‌డబ్ల్యూ/ గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ. అనుభవం: కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.100.

41 ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు

ఎంఈసీఎల్‌ ఆధ్వర్యంలో ఉన్న మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ 41 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, జియోలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌ తదితరాలు.
విభాగాలు: హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, కెమిస్ట్రీ, ప్రోగ్రామింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ బీఈ/బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ పీజీ / పీజీ డిప్లొమా. అనుభవం: 2-17 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు: 30-50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఈ రెండు రకాల పోస్టులకూ...
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.09.2023.

వెబ్‌సైట్‌:  www.mecl.co.in/Careers.aspx 


ఎయిమ్స్‌ రిషికేశ్‌లో  సీనియర్‌ రెసిడెంట్‌లు

రిషికేశ్‌ (ఉత్తరాఖండ్‌)లోని ఎయిమ్స్‌ కింది విభాగాల్లో 49 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆప్తాల్మాలజీ, పాథాలజీ/ ల్యాబ్‌ మెడిసిన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌. వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,200. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.09.2023.

వెబ్‌సైట్‌: https://aiimsnagpur.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని