సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో కొలువులు

ప్రభుత్వ మినీరత్న సంస్థ.. సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ 153 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

Published : 29 Aug 2023 00:35 IST

ప్రభుత్వ మినీరత్న సంస్థ.. సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ 153 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాన్ని అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ, బీఎస్సీ, బీకామ్‌, బీఏ, సీఏ, పీజీ పాసైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టును బట్టి ఆన్‌లైన్‌ టెస్టును వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ.. ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నుంచి నాలుగోవంతు తగ్గిస్తారు. మొత్తం 153 పోస్టుల్లో.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 18, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-5, అకౌంటెంట్‌-24, సూపరింటెండెంట్‌ (జనరల్‌)-11, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-81, సూపరింటెండెంట్‌ (జనరల్‌)-ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ)-2, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ - ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ)-10, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎస్‌ఆర్‌డీ (లడఖ్‌ యూటీ)-2 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థుల వయసు 24.09.2023 నాటికి జేటీఏ పోస్టులకు 28 సంవత్సరాలు, మిగతా ఉద్యోగాలకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) లకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

అకౌంటెంట్‌ పోస్టుకు మాత్రం మూడేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. మిగతా వాటికి అవసరం లేదు. అన్ని పోస్టులకూ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ను అదనపు అర్హతగా పరిగణిస్తారు. దరఖాస్తు ఫీజు యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీహెచ్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.400.


సన్నద్ధత సంగతి?

న్‌లైన్‌ పరీక్షలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలకే ఎక్కువ మార్కులు కేటాయించారు. సంబంధిత విభాగాలకు చెందిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడించారు. వాటి ప్రకారం సన్నద్ధమైతే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సంపాదించొచ్చు.

  • ఇంజినీరింగ్‌ లేదా ఇతర డిగ్రీల్లోని సబ్జెక్టులను ఇప్పటికే చదివి ఉంటారు. వాటిని జాగ్రత్తగా పునశ్చరణ చేస్తూ పట్టు సాధించాలి.
  • సబ్జెక్టులపరంగా ముఖ్యాంశాలను నోట్‌పుస్తకంలో రాసుకుని చదువుకుంటే సమయం వృథా కాదు.
  • రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి.. వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు.
  • బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ.. లాంటి ఇతర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలూ సన్నద్ధతకు తోడ్పడతాయి.
  • పరీక్ష కాలవ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఆ నిర్ణీత సమయంలోపలే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు  రాయగలగాలి.

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)/ (ఎలక్ట్రికల్‌): ఈ పోస్టుకు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలో 145 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 55 ప్రశ్నలకు 110 మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.

అకౌంటెంట్‌: ఆన్‌లైన్‌ పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు 40 మార్కులు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలకు 35 మార్కులు. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు, 40 మార్కులు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 65 ప్రశ్నలకు 65 మార్కులు. పరీక్ష వ్యవధి 3 గంటలు.

సూపరింటెండెంట్‌ (జనరల్‌): ఆన్‌లైన్‌ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. వ్యవధి రెండున్నర గంటలు.

జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: ఆన్‌లైన్‌ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు 40 మార్కులు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలకు 35 మార్కులు. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 65 ప్రశ్నలకు 65 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023  

వెబ్‌సైట్‌: http://www.cewacor.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని