నోటిఫికేషన్స్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 6160 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 390, తెలంగాణలో 125 పోస్టులు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఇందులో విజయవంతమైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

Published : 04 Sep 2023 00:23 IST

ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 6160 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 390, తెలంగాణలో 125 పోస్టులు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఇందులో విజయవంతమైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అర్హత: డిగ్రీ, వయసు ఆగస్టు 1, 2023 నాటికి 20-28 ఏళ్లలోపు ఉండాలి.
పరీక్ష: అక్టోబరు/నవంబరులో నిర్వహిస్తారు. తెలుగులోనూ రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 21

వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/sbiaaug23/


42 పారా మెడికల్‌ పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

ఖాళీల వివరాలు:
1. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 10 పోస్టులు
2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 1 పోస్టు
3. కౌన్సెలర్‌/ ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్‌-2: 1 పోస్టు
4. థియేటర్‌ అసిస్టెంట్‌: 9 పోస్టులు
5. ల్యాబ్‌ అటెండెంట్‌: 3 పోస్టులు
6. పోస్ట్‌ మార్టం అసిస్టెంట్‌: 5 పోస్టులు
7. రికార్డ్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు
8. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌: 10 పోస్టులు
9. ఆఫీస్‌ సబార్డినేట్‌: 2 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డీఎంఎల్‌టీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: అకడమిక్‌ మార్కులు, పని అనుభవంతో.
దరఖాస్తులు: చిత్తూరులోని హాస్పిటల్‌ సర్వీసెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2023.

వెబ్‌సైట్‌: https://annamayya.ap.gov.in/


24 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు

నల్గొండ జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఖాళీల వివరాలు:
1. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌:
21 పోస్టులు
స్పెషాలిటీలు: గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ.
2. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జీడీఎంవో: 03 పోస్టులు

ఆర్హతలు: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.09.2023.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 08.09.2023.
వేదిక: సూపరింటెండెంట్‌ కార్యాలయం, జిల్లా కేంద్ర ఆసుపత్రి,  నల్గొండ.

వెబ్‌సైట్‌: https://nalgonda.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని