నోటిఫికేషన్స్‌

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 06 Sep 2023 00:22 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

నాబార్డులో అసిస్టెంట్‌ మేనేజర్‌లు

పోస్టులు:150

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఎ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌): 150 పోస్టులు (యూఆర్‌- 61, ఎస్సీ- 22, ఎస్టీ- 12, ఓబీసీ- 41, ఈడబ్ల్యూఎస్‌- 14)

విభాగాలు: జనరల్‌, కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌, కంపెనీ సెక్రటరీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, జియో ఇన్ఫర్మేటిక్స్‌, ఫారెస్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్టాటిస్టిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌/ మీడియా స్పెషలిస్ట్‌.

అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్‌ డిగ్రీ, సంబంధిత విబాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ.

వయసు: 01-09-2023 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2023.

ఫేజ్‌-1 (ప్రిలిమినరీ)- ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 16-10-2023.

వెబ్‌సైట్‌: https://www.nabard.org


గవర్నమెంట్‌ మింట్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌లు

పోస్టులు : 53

హైదరాబాద్‌లోని ఇండియా గవర్నమెంట్‌ మింట్‌- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫౌండ్రీమ్యాన్‌)- అస్సే అండ్‌ రిఫైనింగ్‌ కేడర్‌ డబ్ల్యూ-1: 05
  • జూనియర్‌ టెక్నీషియన్‌(ఎలక్ట్రోప్లేటింగ్‌)- అస్సే అండ్‌ రిఫైనింగ్‌ కేడర్‌ డబ్ల్యూ-1: 05 
  • జూనియర్‌ టెక్నీషియన్‌(కెమికల్‌ ప్లాంట్‌)- అస్సే అండ్‌ రిఫైనింగ్‌ కేడర్‌ డబ్ల్యూ-1: 08
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (డై అండ్‌ మెడల్‌) డబ్ల్యూ-1: 03 
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రెషియస్‌ మెటల్‌) డబ్ల్యూ-1: 02
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌) డబ్ల్యూ-1: 20 
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రీషియన్‌) డబ్ల్యూ-1: 04
  • జూనియర్‌ టెక్నీషియన్‌(వెల్డర్‌) డబ్ల్యూ-1: 01  
  • జూ. టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) డబ్ల్యూ-1 : 02
  • జూనియర్‌ టెక్నీషియన్‌(ప్లంబర్‌) డబ్ల్యూ-1: 01  
  • జూనియర్‌ టెక్నీషియన్‌(మెషినిస్ట్‌) డబ్ల్యూ-1: 01 
  • జూనియర్‌ టెక్నీషియన్‌(టర్నర్‌) డబ్ల్యూ-1: 01

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.300. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.650.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.10.2023.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌/ నవంబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://igmhyderabad.spmcil.com/


సూపర్‌వైజర్‌ల నియామకం  

పోస్టులు: 11

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ టంకశాల (ఇండియా గవర్నమెంట్‌ మింట్‌)- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సూపర్‌వైజర్‌ (ఓఎల్‌) జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎ-1: 1
  • సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రానిక్స్‌) ఎస్‌-1: 01 
  • సూపర్‌వైజర్‌ (మెకానికల్‌) ఎస్‌-1: 02 
  • సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌) ఎస్‌-1: 01 
  • సూపర్‌వైజర్‌ (సివిల్‌) ఎస్‌-1: 01 
  • సూపర్‌వైజర్‌ (మెటలర్జీ) ఎస్‌-1: 01 
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 బి-3: 02 
  • ఎన్‌గ్రేవర్‌ (మెటల్‌ వర్క్స్‌ బి-3: 01
  • సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ బి-4: 01  

అర్హత: పోస్టునుబట్టి డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, పీజీ.

వయసు: సూపర్‌వైజర్‌ పోస్టులకు 18- 30 ఏళ్లు. ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఎన్‌గ్రేవర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌కు 18- 28 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.300. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.650.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.10.2023.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌/ నవంబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://igmhyderabad.spmcil.com/


అప్రెంటిస్‌షిప్‌

ఓఎన్‌జీసీలో ..

ఖాళీలు 2500

ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌- దేశవ్యాప్తంగా ఓఎన్‌జీసీ సెక్టార్లలో కింది ట్రేడ్‌/ విభాగాల్లో 2500 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 2. డిప్లొమా అప్రెంటిస్‌ 3. ట్రేడ్‌ అప్రెంటిస్‌

సెక్టార్ల వారీగా ఖాళీలు:

  • నార్తర్న్‌ సెక్టార్‌- 159
  • ముంబయి సెక్టార్‌- 436
  • వెస్టర్న్‌ సెక్టార్‌- 732
  • ఈస్టర్న్‌ సెక్టార్‌- 593
  • సదరన్‌ సెక్టార్‌- 378
  • సెంట్రల్‌ సెక్టార్‌- 202

అర్హత: పోస్టును బట్టి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ,  బీఈ, బీటెక్‌.  

ట్రేడ్‌/ విభాగాలు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌, సివిల్‌ ఎగ్జిక్యూటివ్‌, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఫైర్‌ సేఫ్టీ టెక్నీషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌ డీజిల్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, స్టోర్‌ కీపర్‌, మెషినిస్ట్‌, సర్వేయర్‌ తదితరాలు.

వయసు: 20-09-2023 నాటికి 18- 24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9,000. డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000. ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.7,000.

ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.

వర్క్‌ సెంటర్‌: దేహ్రాదూన్‌, మెహసానా, జోర్హాట్‌, నజీరా అండ్‌ శివసాగర్‌, సిల్చార్‌, చెన్నై, కాకినాడ, కరైకాల్‌, రాజమహేంద్రవరం, అగర్తల, కోల్‌కతా, దిల్లీ, జోధ్‌పుర్‌, గోవా, హజీరా, ముంబయి, ఉరాన్‌, అహ్మదాబాద్‌, అంకలేశ్వర్‌, బరోడా, బొకారో, కాంబే.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023.

వెబ్‌సైట్‌: https://ongcindia.com


ప్రవేశాలు

ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతి

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి పదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్‌ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపనున్నట్లు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ తెలియజేసింది. పూర్తి వివరాలకు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించవచ్చు.

వయసు: ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్‌  

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్‌ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపుతారు.

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ మధ్యలోనే మానేసిన అభ్యర్థులూ అర్హులే.

వయసు: ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25/09/2023.

వెబ్‌సైట్‌: https://apopenschool.ap.gov.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని