నోటిఫికేషన్స్

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 ప్రకటనను యూపీఎస్‌సీ విడుదలచేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా.. రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 167 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

Updated : 07 Sep 2023 07:03 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 ప్రకటనను యూపీఎస్‌సీ విడుదలచేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా.. రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 167 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌. 

విద్యార్హతలు: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్‌. లేదా ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జామినేషన్స్‌ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 01-01-2024 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ద్వారా.

ఎంపిక: స్టేజ్‌-1 (ప్రిలిమినరీ) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: మహిళలు/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ విభాగాలకు ఫీజు మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26-09-2023. 

ప్రిలిమినరీ/ స్టేజ్‌-1 పరీక్ష తేదీ: 18-02-2024. 

వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/ 


కర్నూలు జిల్లాలో..

కర్నూలులోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (ఏపీవీవీపీ), డీసీహెచ్‌ఎస్‌ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్‌లో 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • థియేటర్‌ అసిస్టెంట్‌: 03 పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌: 01
  •  జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌: 24ప్లంబర్‌: 01  
  •  ఆఫీస్‌ సబార్డినేట్‌: 0 ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌: 01  వయసు: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ. ఎంపిక: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డీసీహెచ్‌ఎస్‌ కర్నూలు కార్యాలయం, డీఎంహెచ్‌వో ఆఫీస్‌ దగ్గర, కర్నూలు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023.

వెబ్‌సైట్‌:https://kurnool.ap.gov.in/


ఏపీ హైకోర్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌లో..అమరావతిలోని ఏపీ హైకోర్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సీనియర్‌ అసిస్టెంట్‌: 01 
  • జూనియర్‌ అసిస్టెంట్‌: 01
  • స్టెనో-కమ్‌-టైపిస్ట్‌: 02 
  • ఆఫీస్‌ సబార్డినేట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, డిగ్రీ, ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ సర్టిఫికెట్‌, ఇంగ్లిష్‌ షార్ట్‌ హ్యాండ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ సర్టిఫికెట్‌. వయసు: 01.09.2023 నాటికి 18- 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ.400). ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 14-09-2023.
వెబ్‌సైట్‌: https://apslsa.ap.nic.in/notifications.html


వాక్‌-ఇన్స్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీలో..   

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, ఎంఎఫ్‌పీఐ- క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబొరేటరీ 2 రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: ఎంఎస్సీ (ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌)తో పాటు పని అనుభవం. ఇంటర్వ్యూ తేదీ: 23/09/2023.
వేదిక: ఎంఎఫ్‌పీఐ- క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబొరేటరీ, ఈఈఐ క్యాంపస్‌, పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్‌.
వెబ్‌సైట్‌:https://pjtsau.edu.in/


అనంతపురంలో రిసెర్చ్‌ అసోసియేట్‌లు

అనంతపురం కమలానగర్‌లోని అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రిసెర్చ్‌ అసోసియేట్‌: 01 యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 01  

అర్హతలు: డిప్లొమా, డిగ్రీ (అగ్రికల్చర్‌), ఎంఎస్సీ, పీహెచ్‌డీ (ఆగ్రోమెటీరియోలజీ/ అగ్రోనమీ)తో పాటు పని అనుభవం.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 12-09-2023.
స్థలం: వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, బుక్కరాయసముద్రం (మండలం), అనంతపురం (జిల్లా).
వెబ్‌సైట్‌:https://angrau.ac.in/


బాపట్లలో టీచింగ్‌ అసోసియేట్‌లు

బాపట్లలోని వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు ప్రాతిపదికన 2 టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: డిగ్రీ (అగ్రికల్చర్‌), ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ (అగ్రోనమీ)తో పాటు పని అనుభవం.  వయసు: 45 సంవత్సరాలు. వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 13-09-2023. స్థలం: వ్యవసాయ కళాశాల, బాపట్ల. వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


ప్రవేశాలు

మనూ, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) - పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీట్ల సంఖ్య: 03. పరిశోధనాంశాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌. అర్హత: 55% మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ). ఫెలోషిప్‌: నెలకు రూ.38,750 - రూ.43,750. ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.550; ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులు/ మహిళలకు రూ.350.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.09.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 27.9.2023 వెబ్‌సైట్‌:  www.manuu.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని