ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 11 Sep 2023 00:05 IST

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలు  
పోస్టులు :5089

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఖాళీలు: ఎస్‌జీటీ- 2,575; స్కూల్‌ అసిస్టెంట్‌- 1,739, లాంగ్వేజ్‌ పండిట్‌- 611, పీఈటీ- 164.  

అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఎడ్‌, బీఈడీ, టెట్‌. వయసు: అభ్యర్థుల గరిష్ఠ వయః పరిమితి 44 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్లు,  దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 20 నుంచి  ప్రారంభం.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 21

పరీక్షలు (కంప్యూటర్‌ బేస్డ్‌): నవంబర్‌ 20 నుంచి 30 వరకు.

పరీక్ష కేంద్రాలు: మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ,

సంగారెడ్డి. దరఖాస్తు రుసుం: రూ.1000.

వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in/ISMS/


పోసెంట్రల్‌ వర్సిటీలో..

పోస్టులు: 95

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 95 పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • డిప్యూటీ రిజిస్ట్రార్‌(డిప్యుటేషన్‌)-1 ః అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌- 4
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌- 2
  • సెక్షన్‌ ఆఫీసర్‌- 2
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌)- 02
  • సెక్యూరిటీ ఆఫీసర్‌- 2
  • సీనియర్‌ అసిస్టెంట్‌- 2
  • ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-1
  • జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌)- 8
  • అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌- 1
  • జూనియర్‌ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌- 2
  • స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌- 1
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌- 10
  • లైబ్రరీ అసిస్టెంట్‌- 4
  • జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌- 44
  • హిందీ టైపిస్ట్‌- 1
  • ల్యాబొరేటరీ అటెండెంట్‌- 8

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చిరునామా: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, రిక్రూట్‌మెంట్‌ సెల్‌, రూమ్‌ నెం: 221, ఫస్ట్‌ ఫ్లోర్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ప్రొఫెసర్‌. సి.ఆర్‌. రావు రోడ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06-10-2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/


స్టాఫ్‌ నర్సు, పారామెడికల్‌ పోస్టులు

పోస్టులు : 68

లూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఏలూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌: 11
  • స్టాఫ్‌ నర్స్‌: 25  
  • ఫార్మసిస్ట్‌: 10
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌: 4
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 6
  • లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌: 12  

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, జీఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఏలూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 16-09-2023.

వెబ్‌సైట్‌: https://eluru.ap.gov.in/


వైఎస్సార్‌ జిల్లాలో..

పోస్టులు: 12

డపలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆఫీస్‌ వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ల్యాబ్‌ టెక్నీషియన్‌: 1 
  • రేడియోగ్రాఫర్‌: 1  
  • పోస్ట్‌ మార్టం అసిస్టెంట్‌: 5
  • థియేటర్‌ అసిస్టెంట్‌: 4  
  • ఆఫీస్‌ సబార్డినేట్‌: 1 పోస్టు

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, సర్టిఫికెట్‌ కోర్సు, డీఎంఎల్‌టీ, బీఎస్సీ.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, ఓ-బ్లాక్‌, కొత్త కలెక్టరేట్‌, కడప, వైఎస్సార్‌ జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 15-09-2023.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/


సీనియర్‌ ఆఫీసర్‌, మేనేజర్‌లు

పోస్టులు: 37

ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)- 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

1. సీనియర్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌/ మేనేజర్‌: 27  

2. సీనియర్‌ మేనేజర్‌: 06  

3. చీఫ్‌ మేనేజర్‌/ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 04

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ+ అనుభవం.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ  ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.

వెబ్‌సైట్‌: https://hindustanpetroleum.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని