నోటిఫికేషన్స్

ముంంబయి రైల్వే వికాస్‌ కార్పొరేషన్‌- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 ప్రాజెక్టు ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Sep 2023 00:38 IST

వాక్‌-ఇన్స్‌

ముంబయి రైల్వే వికాస్‌ కార్పొరేషన్‌లో..  

ముంంబయి రైల్వే వికాస్‌ కార్పొరేషన్‌- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 ప్రాజెక్టు ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌)తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

పోస్ట్స్
ఇంటర్వ్యూ తేదీలు: 25 నుంచి 29-09-2023 వరకు.
వేదిక: మేనేజర్‌(హెచ్‌ఆర్‌), ఎంఆర్‌వీసీ కార్పొరేట్‌ ఆఫీస్‌, 2వ అంతస్తు, చర్చిగేట్‌ రైల్వే స్టేషన్‌ బిల్డింగ్‌, ముంబయి.
వెబ్‌సైట్‌: https://mrvc.indianrailways.gov.in/


ఉద్యోగాలు

ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌లు  

ఐఐటీ బాంబే కాంట్రాక్టు ప్రాతిపదికన 2 ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: బీఈ/ బీటెక్‌ లేదా ఎంఈ, ఎంటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌)తో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 06.10.2023.
వెబ్‌సైట్‌:https://www.iitb.ac.in/
 


టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు  

ఐఐటీ బాంబే తాత్కాలిక ప్రాతిపదికన 2 టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ అనలిటికల్‌ కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28.09.2023.

పోస్ట్స్

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/


సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌లు

ఐఐటీ బాంబే ఒప్పంద ప్రాతిపదికన 2 సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: బీఈ, బీటెక్‌, ఎంఏ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ లేదా బీఏ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.10.2023.

పోస్ట్స్

వెబ్‌సైట్‌:https://www.iitb.ac.in/


ప్రవేశాలు

ఎన్‌ఐపీహెచ్‌ఎంలో పీజీ డిప్లొమా, డిప్లొమా

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా: 30 సీట్లు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) లేదా బీఈ, బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌)/ ఎంఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌).
2. డిప్లొమా ఇన్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌: 30 సీట్లు
అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ లైఫ్‌ సైన్సెస్‌/ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) లేదా బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌). ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.
రాత పరీక్ష తేదీ: 16-10-2023.
తరగతుల ప్రారంభం: 01-11-2023.
వెబ్‌సైట్‌: https://niphm.gov.in/general/pgdphm.html
 


ఎన్‌ఐడీలో బీడిజైన్‌ ప్రోగ్రామ్‌  

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎన్‌ఐడీ క్యాంపస్‌లు: ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం.
స్పెషలైజేషన్‌: యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ తదితరాలు.
సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 125 సీట్లు, ఏపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌ల్లో ఒక్కోదానిలో 75 సీట్లు. విదేశీ విద్యార్థులకు అదనంగా సీట్లు కేటాయించారు.
అర్హతలు: అభ్యర్థులు 2003 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 2023 మే/ జూన్‌ నాటికి ఇంటర్‌/ పన్నెండో తరగతి (సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యూమానిటీస్‌ గ్రూపు). ఎంపిక: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-12-2023.
ప్రిలిమ్స్‌ తేదీ: 24-12-2023. మెయిన్స్‌ తేదీ: 27-04-2024.
వెబ్‌సైట్‌:https://admissions.nid.edu/NIDA2024/Default.aspx


ఎండిజైన్‌ ప్రోగ్రామ్‌

  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్ ఎండిజైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎన్‌ఐడీ క్యాంపస్‌లు: అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌.
స్పెషలైజేషన్‌: యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫొటోగ్రఫీ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిజైన్‌, యూనివర్సల్‌ డిజైన్‌ తదితరాలు.
సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 107, గాంధీనగర్‌ క్యాంపస్‌లో 88, బెంగళూరు క్యాంపస్‌లో 95 ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు 1992 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా (డిజైన్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌/ అప్లైడ్‌  ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌).
ఎంపిక: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-12-2023.
ప్రిలిమ్స్‌: 24-12-2023. మెయిన్స్‌: 03-03-2024, 06-04-2024.
వెబ్‌సైట్‌: https://admissions.nid.edu/NIDA2024/Default.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని