నోటిఫికేషన్స్
గాంధీనగర్లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్)- 15 సైంటిఫిక్ అసిస్టెంట్-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
సైంటిఫిక్ అసిస్టెంట్-బి పోస్టులు
గాంధీనగర్లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్)- 15 సైంటిఫిక్ అసిస్టెంట్-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఎస్సీ.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13/10/2023.
వెబ్సైట్: https://www.ipr.res.in/
వాక్ ఇన్
బెంగళూరులో జేఆర్‌ఎఫ్ ఖాళీలు
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- తాత్కాలిక ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో: 04
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 04
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ.
వయసు: జేఆర్‌ఎఫ్ ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. పీఏ పోస్టులకు గరిష్ఠ వయః పరిమితి లేదు.
ఇంటర్వ్యూ తేదీ: 21.09.2023.
స్థలం: ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18వ క్రాస్, మల్లేశ్వరం, బెంగళూరు.
వెబ్సైట్: https://www.icfre.org/recruitment
ప్రవేశాలు
దామోదరం సంజీవయ్య వర్సిటీలో ఎల్‌ఎల్‌డీ
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ మూడేళ్ల ఎల్‌ఎల్‌డీ ప్రోగ్రామ్ (పోస్ట్ డాక్టోరల్)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా విభాగంలో పీహెచ్‌డీ.
ఎంపిక: రిసెర్చ్ ప్రపోజల్, ప్రెజెంటేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు: దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా పంపాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం’ చిరునామాకు పంపించాలి.
Email: admissionsphd.lld@dsnlu.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023
వెబ్సైట్: https://dsnlu.ac.in
ఓయూలో ఎంబీఏ ఈవెనింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్) ఈవెనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీతో పాటు ఎగ్జిక్యూటివ్ కేడర్లో రెండేళ్ల అనుభవం ఉండాలి. టీఎస్ ఐసెట్-2023 అర్హత సాధించి ఉండాలి లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైవుండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తును ‘డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 01-10-2023.
వెబ్సైట్: https://www.osmania.ac.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్
-
Amazon River: అమెజాన్ నదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
-
DL Ravindra Reddy: తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: డీఎల్
-
Salaar: ‘సలార్’ ఆ సినిమాకు రీమేక్..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ
-
Mexico: చర్చి పైకప్పు కుప్పకూలి.. ముగ్గురు చిన్నారులు సహా 10 మంది మృతి!