నోటిఫికేషన్స్

సికింద్రాబాద్‌లోని డైరెక్టర్‌ కార్యాలయం, ఆయుష్‌ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డా.బీఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (ఎర్రగడ్డ), డాక్టర్‌ ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్‌)లో 9 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 25 Sep 2023 00:18 IST

ఉద్యోగాలు

తెలంగాణ ఆయుష్‌ విభాగంలో..

సికింద్రాబాద్‌లోని డైరెక్టర్‌ కార్యాలయం, ఆయుష్‌ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డా.బీఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (ఎర్రగడ్డ), డాక్టర్‌ ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్‌)లో 9 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు 9

ప్రొఫెసర్‌: 4

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 5

అర్హతలు: ఆయుర్వేదంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీతోపాటు టీచింగ్‌ అనుభవం.

వయసు: 01-07-2023 నాటికి 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, టీచింగ్‌ అనుభవం, ఇంటర్వ్యూ.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌ కార్యాలయం, ఆయుష్‌ శాఖ, సికింద్రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2023.

వెబ్‌సైట్‌: //ayush.telangana.gov.in/


శ్రీసత్యసాయి జిల్లాలో..

శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 65 అంగన్‌వాడీ వర్కర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు: హిందూపూర్‌, ధర్మవరం, సీకే పల్లి, మడకశిర, పెనుకొండ, కదిరి, నల్లచెరువు, గుడిబండ, సోమందేపల్లి, పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు.

పోస్టులు 65

వయసు: 21- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత శ్రీసత్యసాయి జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2023.

వెబ్‌సైట్‌: //srisathyasai.ap.gov.in/


కరూర్‌ వైశ్యాలో బ్యాంకింగ్‌ అప్రెంటిస్‌

రూర్‌ వైశ్యా బ్యాంక్‌ లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా ఉన్న కేవీబీల్లో బ్యాంకింగ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

అర్హత: 50% మార్కులతో ఏదైనా విభాగం నుంచి 2022, 2023లో నాన్‌-ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. పని ప్రదేశంలో కనీసం ఒకదానిలోనైనా స్థానిక భాష మాట్లాడటం తెలిసి ఉండాలి. ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 31.03.2023 నాటికి 20- 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30-09-2023.

వెబ్‌సైట్‌: https://www.karurvysya-bank.co.in/Careers/kvb-careers.asp


ఇఫ్కోలో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీలు

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌, ప్రధాన కార్యాలయం- అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల్లో స్థాపితమైన ఇఫ్కో కేంద్రాలు/ కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అర్హత: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్‌) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్‌, 2023 నాటికి చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01 ఆగస్టు, 2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.33,000 స్ట్టైపెండ్‌ అందుతుంది. అనంతరం రూ.37,000-రూ.70,000 జీతంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక: ప్రిలిమినరీ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఫైనల్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్‌, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, లఖ్‌నవూ, నాగ్‌పుర్‌, గువాహటి, పట్నా, రాయ్‌పుర్‌, సూరత్‌, వారణాసి, చండీగఢ్‌, దేహ్రాదూన్‌, పుణె, హైదరాబాద్‌, విజయవాడ, కొచ్చిన్‌, జోధ్‌పుర్‌, జమ్మూ, సిమ్లా, భోపాల్‌, జబల్‌పూర్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-10-2023.

వెబ్‌సైట్‌: https://www.iffco.in/en/corporate

ఆన్‌లైన్‌ దరఖాస్తు: http://agt.iffco.in/LOGIN-2/iffco-agt.jsp


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని