నొటిఫికేషన్స్

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 28 Sep 2023 02:39 IST

ఉద్యోగాలు

తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  ఫ్యాషన్‌ డిజైన్‌
  • ఇంటీరియర్‌ డిజైన్‌
  •  ఫొటోగ్రఫీ   
  • కంప్యూటర్‌ సైన్స్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2023.
వెబ్‌సైట్‌:https://www.ttwrdcs.ac.in


సిపెట్‌, భోపాల్‌లో లెక్చరర్‌లు

భోపాల్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పందప్రాతిపదికన 5 లెక్చరర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 01 కెమిస్ట్రీ- 1మ్యాథ్స్‌- 1
  • ప్లాస్టిక్స్‌/ పాలిమర్‌- 01 
  •  ఇంగ్లిష్‌- 1

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  
దరఖాస్తు: దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సిపెట్‌-భోపాల్‌, జి-సెక్టార్‌, భోపాల్‌’ చిరునామాకు రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-10-2023.
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in
 


సిపెట్‌, భువనేశ్వర్‌లో..

భువనేశ్వర్‌లోని సిపెట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

  • లెక్చరర్‌ (ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)- 1
  •  లెక్చరర్‌ (మ్యాథ్స్‌)- 1  ః లెక్చరర్‌ (ఇంగ్లిష్‌)- 1
  •  ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 1

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సిపెట్‌- భువనేశ్వర్‌, ఎ-సెక్టార్‌, జోన్‌-బి, మంచేశ్వర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, భువనేశ్వర్‌ ’ చిరునామాకు రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2023.
వెబ్‌సైట్‌:https://www.cipet.gov.in


మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐఎంఎల్‌), సీఎస్‌ఈ (డీఎస్‌), సీఎస్‌ఈ (సైబర్‌ సెక్యూరిటీ), కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఐటీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌.  అర్హత: పీజీ, పీహెచ్‌డీ.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: recruitment@matrusri.edu.in
దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్‌:https://matrusri.edu.in/society/


అన్నమాచార్య కాలేజీలో ..

కడప జిల్లా రాజంపేట న్యూ బోయనపల్లిలోని అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.:

  •  ప్రొఫెసర్‌
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ), సీఎస్‌ఈ (డీఎస్‌), ఏఐ/ డీఎస్‌, ఏఐ/ ఎంఎల్‌, ఈఈఈ, ఈసీఈ, సివిల్‌, ఫిజిక్స్‌, ఎంబీఏ, ఎంసీఏ, సైకియాట్రీ, పీడీ కమ్‌ యోగా ట్రైనర్‌.
 నాన్‌ టీచింగ్‌ పోస్టులు: సీఏ, అకౌంటెంట్‌.
అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్‌: https://aitsrajampet.ac.in/recruitment


వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ

జ్యోతిష్మతి కాలేజీలో ..

కరీంనగర్‌లోని జ్యోతిష్మతి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఇంజినీరింగ్‌ కళాశాల కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  ప్రొఫెసర్లు
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్లు
  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
  • విభాగాలు: సీఎస్‌ఈ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, సివిల్‌, మెక్‌, ఈఈఈ, ఈసీఈ, ఫార్మసీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌.
  •  పీడీ, అకౌంటెంట్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, ఆఫీస్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్‌, అకౌంటెంట్‌, వార్డెన్లు, ఎలక్ట్రీషియన్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.  ఇంటర్వ్యూ తేదీలు: 29, 30-09-2023.
స్థలం: జ్యోతిష్మతి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నుస్తులాపూర్‌, కరీంనగర్‌.
వెబ్‌సైట్‌: https://jits.ac.in


ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్‌ పీజీలు

ఐఐటీల్లో ఈ-మాస్టర్స్‌ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్‌ పీజీ కోర్సులు అందిస్తున్నారు. తాజాగా ఐఐటీ కాన్పూర్‌ ఒకేసారి నాలుగు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములను ప్రవేశపెట్టింది. ‘క్లైమెట్‌ ఫైనాన్స్‌ - సస్టైనబిలిటీ, రెన్యుబుల్‌ ఎనర్జీ అండ్‌ ఈ-మొబిలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషీన్‌ లెర్నింగ్‌, బిజినెస్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ డిజిటల్‌ ఏజ్‌’ అనే కోర్సులను నూతనంగా మొదలుపెట్టబోతోంది.

  •     ఈ కోర్సులను విద్యార్థులు ఏడాది నుంచి మూడేళ్ల కాలంలోపు ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. వారాంతాల్లో లైవ్‌ ఇంటరాక్టివ్‌ తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే యువతను దృష్టిలో వీటిని తయారుచేశారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టు నడిచే ఈ కోర్సుల్లో 60 క్రెడిట్లు, 12 మాడ్యూల్స్‌ ఉంటాయి. ఐఐటీ కాన్పూర్‌ అధ్యాపకులు, పరిశోధకులు ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు.

మరిన్ని వివరాలకు: emasters.iitk.ac.in 


ఐఐటీ గాంధీనగర్‌లో..: ‘ఎనర్జీ పాలసీ అండ్‌ రెగ్యులేషన్‌’ అంశంపై ఐఐటీ గాంధీనగర్‌ రెండేళ్ల ఆన్‌లైన్‌ పీజీ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ కోర్సు ఉండబోతోంది. ఇంజినీరింగ్‌, లా, ఎకనమిక్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ సబ్జెక్టులు చదివే విద్యార్థులెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరే వారికి సౌకర్యవంతంగా ఉండేలా సులభమైన పనివేళల్లో పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి చేసిన అభ్యర్థులకు పూర్వ విద్యార్థిగా గుర్తింపుతోపాటు ప్లేస్‌మెంట్‌ సహాయం సైతం లభిస్తుంది.

  •  వీటిలో చేరేందుకు గేట్‌ స్కోరుతో పనిలేదు. వచ్చే జనవరి నుంచి తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 31వ తేదీ వరకూ దరఖాస్తులకు సమయం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని