తేజ్‌పూర్‌ వర్సిటీలో ఎంబీఏ

అసోం రాష్ట్రం తేజ్‌పూర్‌లోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 02 Oct 2023 00:07 IST

అసోం రాష్ట్రం తేజ్‌పూర్‌లోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో (ఫైన్‌ ఆర్ట్స్‌ మినహా) బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతలో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ రికార్డులు, పని అనుభవం, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, పర్సనల్‌ ఇంటరాక్షన్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-12-2023.

వెబ్‌సైట్‌: https://www.tezu.ernet.in/

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీములో భాగంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.  

అర్హత: ఎంఈ, ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌) లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.

పరిశోధనాంశాలు: అల్గారిథమ్స్‌, కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ ఇమేజ్‌ అనాలిసిస్‌, కంప్యుటేషనల్‌ జామెట్రీ, నెట్‌వర్క్‌ అనాలిసిస్‌.

ఎంపిక: అకడమిక్‌ రికార్డులు, పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2023.

షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల వివరాల వెల్లడి: 17-10-2023

ఇంటర్వ్యూ తేదీ: 31-10-2023

వెబ్‌సైట్‌: https://www.tezu.ernet.in/

ఐఐటీ హైదరాబాద్‌లో ..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌), ఫిజిక్స్‌ విభాగం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (స్పెషల్‌ రౌండ్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పీజీ (ఫిజిక్స్‌)తో పాటు యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌/ డీఎస్టీ- ఇన్‌స్పైర్‌ అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ దివ్యాంగులకు రూ.250.

గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2023.

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/careers/

ఆర్‌ఏఆర్‌ఎస్‌, మారుటేరులో..

మారుటేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కాంట్రాక్ట్‌/ తాత్కాలిక ప్రాతిపదికన 4 టీచింగ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టీచింగ్‌ అసోసియేట్‌: 01

టీచింగ్‌ అసిస్టెంట్‌: 03

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.  

వయసు: టీచింగ్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు (పురుషులకు), 45 ఏళ్లు (మహిళలకు) మించకూడదు. టీచింగ్‌ అసిస్టెంట్‌ 35 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్‌ ప్రదేశం: పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌- మారుటేరు, రంపచోడవరం.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 05.10.2023.

స్థలం: ఆర్‌ఏఆర్‌ఎస్‌, మారుటేరు.

వెబ్‌సైట్‌:  https://angrau.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని